Tirumala : మే నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలివే-the details of the special festivals to be celebrated in the month of may in tirumala 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : మే నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలివే

Tirumala : మే నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 28, 2024 09:32 AM IST

Tirumala Tirupati Devasthanam Updates : వచ్చే మే నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను వెల్లడించింది టీటీడీ. ఈ మేరకు ఆయా తేదీలు, ఉత్సవాలను పేర్కొంది.

తిరుమల విశేష ఉత్సవాలు
తిరుమల విశేష ఉత్సవాలు

Special Festivals at Tirumala 2024: వచ్చే మే మాసంలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలపై ప్రకటన చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం(TTD). మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుగుతాయని తెలిపింది. మే మాసానికి సంబంధించి జరిగే విశేష ఉత్సవాల పూర్తి వివరాలను వెల్లడించింది. ⁠ ⁠మే 10న అక్షయతృతీయ ఉంటుందని తెలిపింది.

మే నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలివే

•⁠ ⁠మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం.

•⁠ ⁠మే 4న‌ సర్వ ఏకాదశి.

•⁠ ⁠మే 10న అక్షయతృతీయ.

•⁠ ⁠మే 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి.

•⁠ ⁠మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.

– మే 22న నృసింహ జ‌యంతి, త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి.

– మే 23న శ్రీ అన్న‌మాచార్య జ‌యంతి, కూర్మ జ‌యంతి.

శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి(Sri Govindarajaswami temple) వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. వాహన సేవల వివరాలను టీటీడీ వెల్లడించింది.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

  • 16-05-2024

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – పెద్దశేష వాహనం

  • 17-05-2024

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

  • 18-05-2024

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

  • 19-05-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

  • 20-05-2024

ఉదయం – మోహినీ అవతారం

రాత్రి – గరుడ వాహనం

  • 21-05-2024

ఉదయం – హనుమంత వాహనం

రాత్రి – గజ వాహనం

  • 22-05-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

  • 23-05-2024

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

  • 24-05-2024

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం.

Whats_app_banner