December 14 Telugu News Updates : మీరు పోలీసులా.. దొంగలా? - రేవంత్ రెడ్డి-telangana and andhrapradesh telugu live news updates 14 december 2022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  December 14 Telugu News Updates : మీరు పోలీసులా.. దొంగలా? - రేవంత్ రెడ్డి

ఏపీ తెలంగాణ తాజా వార్తలు

December 14 Telugu News Updates : మీరు పోలీసులా.. దొంగలా? - రేవంత్ రెడ్డి

08:27 AM ISTDec 14, 2022 01:57 PM Mahendra Maheshwaram
  • Share on Facebook

  • తెలంగాణ, ఏపీ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. తాజా వార్తల కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Wed, 14 Dec 202208:27 AM IST

కొండా సురేఖ ఫైర్ 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ ఘాటుగా స్పందించారు. తెలంగాణ జాగృతిని అడ్డుపెట్టుకుని సీబీఐ నుంచి తప్పించుకోవాలని కవిత చూస్తున్నారని ఆరోపించారు. జాగృతి పేరుతో ఎమ్మెల్సీ కవిత కోట్లాది రూపాయలు వసూలు చేశారని వ్యాఖ్యానించారు. తెలంగాణను దోచుకోవటం అయిపోందని.. ఇక దేశాన్ని దోచుకోవడానికే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని విమర్శించారు.

Wed, 14 Dec 202207:54 AM IST

రేవంత్ ఫైర్

‘కాంగ్రెస్ వార్ రూంలో డేటాను ధ్వంసం చేశారు.. మా నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం రోజు కాంగ్రెస్‌పై ఇలా చేస్తారా.. మీరు పోలీసులా.. దొంగలా?’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Wed, 14 Dec 202207:53 AM IST

కాంగ్రెస్ ఆందోళనలు 

గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఎం కేసీఆర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు…. తర్వాత ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టారు. తర్వాత కాంగ్రెస్ నేతలు.. డీజీపీ ఆఫీసును ముట్టడించేందుకు ర్యాలీగా వెళ్తుండటంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా హస్తం శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. 

Wed, 14 Dec 202206:50 AM IST

బీఆర్ఎస్ ఆపీస్ ప్రారంభం

మరికాసేపట్లో ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ నూతన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఢిల్లీ నడిబొడ్డున సర్దార్‌ పటేల్‌ రోడ్డులో పార్టీ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:37 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.

Wed, 14 Dec 202204:46 AM IST

వాయిదా తీర్మానం

కాంగ్రెస్ వార్ రూమ్ సీజ్ చేయడాన్ని ఏఐసీసీ సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు మాణిక్యం ఠాగూర్ పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇచ్చారు. 

Wed, 14 Dec 202204:45 AM IST

గోల్డ్ ఏటీఏం ఎలా పని చేస్తుందంటే..?

India's First Gold ATM in Hyderabad: ఏటీఎమ్‌ వెళ్తున్నామంటే ఆర్థిక లావాదేవీల గురించే అని చెప్పొచ్చు..! ఇకపై అర్థం మారిపోయింది. గోల్డ్ కు సంబంధించి కూడా ATMలకు వెళ్లొచ్చు. డైరెక్ట్ గా వీటి ద్వారానే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి అద్భుతమైన సర్వీస్ కు వేదికైంది మన హైదరాబాద్ నగరం. దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను కొద్దిరోజుల కిందటే హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. గోల్డ్‌ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్‌లో ఉన్న సంస్థ కార్యాలయంలో ఈ ఏటీఎంను ప్రారంభించారు. ఈ ఏటీఎంల ద్వారా డెబిట్, క్రెడిట్‌ కార్డు సహాయంతో బంగారం విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇది ఎలా పని చేస్తుంది..? ఎంతవరకు బంగారం పొందవచ్చు..? అనేది చూస్తే.....

ఎలా డ్రా చేసుకోవాలంటే..?

ఈ గోల్డ్ ATM క్యాష్‌ ఏటీఎంల మాదిరిగానే పనిచేస్తుంది.

మొదటగా ఏటీఎంపై ‘క్లిక్‌ హియర్‌ టు బై గోల్డ్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ క్లిక్‌ చేయండి.

మీరు ఎంత బంగారాన్ని కొనుగోలు చేయాలో ఎంచుకోవాలి. అక్కడ 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాములు ఇలా వివిధ సంఖ్యలు అందుబాటులో ఉంటాయి. మీకు కావాల్సిన నెంబర్ ను క్లిక్ చేయాలి.

నెక్స్ట్ మీరు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల్లో ఏ కార్డును ఉపయోగిస్తారో తెలపాలి.

తర్వాత కార్డు insert చేసి మీ పిన్‌ ఎంటర్‌ చేయాలి.

లావాదేవీ విజయవంతమైన తర్వాత ఏటీఎం కింది భాగం నుంచి మీరు ఎంచుకున్న బరువుకు సంబంధించి గోల్డ్‌ కాయిన్‌ వస్తుంది.

మీ లావాదేవీకి సంబంధించి వివరాలు వస్తాయి. ఇందులో బంగారం నాణ్యత, బరువు వివరాలు ఉంటాయి.

Wed, 14 Dec 202203:12 AM IST

మరో యూనిట్.. 

Investment: ఏపీలో పెట్టుబడులపై అమరరాజా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నుంచి కంపెనీ తరలిపోనుందంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ.. రూ. 250 కోట్లతో మరో యూనిట్ ప్రారంభించేందుకు సిద్ధమైంది.

Wed, 14 Dec 202203:11 AM IST

సోదాలు

తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ టీమ్ హెడ్ ఆఫీసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. సోదాల సమయంలో సునీల్‌ కార్యాలయంలోని సిబ్బందితో సెల్‌ఫోన్‌లు ఆఫ్‌ చేయించారు పోలీసులు.

Wed, 14 Dec 202202:02 AM IST

నేడు ప్రారంభం

BRS Party Office inaguration in Delhi: ఇవాళ ఢిల్లీలో బీఆర్ఎస్ నూతన కార్యాలయం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 తర్వాత జరిగే ఈ కార్యక్రమానికి పలు ప్రాంతీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఆఫీసులో తలపెట్టిన రాజశ్యామల, నవచండీయాగాల్లో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొననున్నారు.

Wed, 14 Dec 202201:25 AM IST

ఆందోళన చేస్తాం..

ఉద్యోగుల సమస్యలను సంక్రాంతి పండగలోపు పరిష్కరించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైవీ రావు హెచ్చరించారు. రావాల్సిన బకాయిలు అడుగుతామనే సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఆందోళన సృష్టిస్తున్నారని విమర్శించారు. జీతభత్యాల చెల్లింపు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై సీఎం జగన్‌ జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Wed, 14 Dec 202201:22 AM IST

బీఆర్ఎస్ 

నేడు బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేసీఆర్ హస్తినలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రాంతీయ పార్టీల అధినేతలు వచ్చే అవకాశం ఉంది.

Wed, 14 Dec 202201:21 AM IST

నవీన్ రెడ్డి సెల్ఫీ వీడియో 

Naveen Reddy Selfie Video: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన సూత్రధారి నవీన్ రెడ్డిని పోలీసులు మంగళవారం గోవాలో అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతని వద్ద నుంచి ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ కు ముందే అతను మాట్లాడినట్లుగా ఉన్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాను చేసింది తప్పేనని చెప్పాడు నవీన్ రెడ్డి. కానీ దాని వెనుక చాలా బాధ దాగుందని చెప్పారు వ్యాఖ్యానించాడు. తనకున్న కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా తాను పోలీసులకు సరెండర్ కాలేదని పేర్కొన్నాడు. బ్యాడ్మింటన్‌లో తాను ఆడే కోర్టుకే వైశాలి, ఆమె ఇరుగుపొరుగు వచ్చి ఆడేవారని నవీన్ రెడ్డి చెప్పాడు. తర్వాత వైశాలి ఒక్కరే బ్యాడ్మింటన్ ఆడటానికి వచ్చేదని, అక్కడ ఆమె పరిచయం అయ్యిందని తెలిపాడు. ఆట ముగించిన తర్వాత మిస్టర్ టీ వ్యవహారాల్లో తాను బిజీగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. బ్యాడ్మింటన్ కోర్ట్‌కు సమీపంలోనే తన టీ స్టాల్ వుండటంతో వైశాలితో కబుర్లు చెబుతూ వుండేవాడినని, కొన్నిరోజులకు ఇద్దరి అభిరుచులు కలిశాయని తెలిపాడు. ఈ క్రమంలోనే పెళ్లి విషయాన్ని కొన్ని ప్రస్తావించాని వివరించాడు. ఇక తన మీద మీడియాలో చాలా ప్రచారాలు జరుగుతున్నాయని నవీన్ రెడ్డి వాపోయాడు. దాని వల్ల తన కుటుంబం కూడా బాధపడుతోందని చెప్పాడు. తన స్థానంలో ఒక అమ్మాయి ఉంటే ఇదే విధంగా సమాజం వ్యవహరించేదా? అని నవీన్‌ రెడ్డి ప్రశ్నించాడు. ఈ గొడవను అమ్మాయి, అబ్బాయి గొడవగా కాకుండా కుటుంబానికి సంబంధించిన వ్యవహారంగా చూడాలని కోరాడు.

Wed, 14 Dec 202201:21 AM IST

అసెంబ్లీ బరిలో బండి…?

Telangana Politics: ఎన్నికల ఏడాది వచ్చేసింది...! రాజకీయపార్టీలు కూడా అలర్ట్ అయిపోతున్నాయ్..! హ్యాట్రిక్ కొట్టాలని టీఆర్ఎస్ చూస్తుంటే.. ఎలాగైనా తాము అధికారంలోకి రావాలని చూస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు..! మరోవైపు నేతలు కూడా అప్పుడే టికెట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పుడే లైన్ క్లియర్ చేసుకుంటే బెటర్ అన్నట్లు పావులు కదిపే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే చాలా మంది ముఖ్య నేతలు కూడా... పొలిటికల్ ప్యూచర్ పై తెగ ఆలోచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సంబంధించి పలు వార్తలు ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారని తెలుస్తోంది. ఇందుకోసం ఓ సీటును ఖరారు చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.