Viveka Murder Case: వివేకా హత్య కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు..-remand extension for accused in vivekananda reddy murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Viveka Murder Case: వివేకా హత్య కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు..

Viveka Murder Case: వివేకా హత్య కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు..

HT Telugu Desk HT Telugu
Jun 30, 2023 01:38 PM IST

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. ఆరుగురు నిందితులకు రిమాండ్‌ను జులై 14 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

<p>వైఎస్ వివేకానంద రెడ్డి</p>
వైఎస్ వివేకానంద రెడ్డి

Viveka Murder Case: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. ఆరుగురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిల రిమాండ్‌ను జులై 14 వరకు పొడిగిస్తూఉత్తర్వులు జారీచేసింది.

చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నిందితులను పోలీసులు ఇవాళ సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా కోర్టు ఆరుగురు నిందితులకు రిమాండ్‌ పొడిగించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అనుబంధ ఛార్జిషీట్‌ను కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. ఇప్పటికే రెండు ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేయగా, తాజాగామరో ఛార్జిషీటు దాఖలు చేసింది.

వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టులో నేడు విచారణ జరిగింది. కోర్టు విచారణ సందర్భంగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వివేకా హత్య కేసు నిందితులను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. హత్య కేసు దర్యాప్తును జూన్‌ నెలాఖరులోగా పూర్తి చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ను సీబీఐ అధికారులు దాఖలు చేశారు. నాంపల్లి సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. మరోవైపు జులై 14 వరకూ సీబీఐ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. దీంతో నిందితులను చంచల్ గూడ జైల్‌కు తరలించారు.

వివేకా హత్య కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌తో కలిపి మొత్తం 3 ఛార్జ్ షీట్‌లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే సీబీఐ కోర్టు నిందితులకు రిమాండ్ పొడిగించింది. తదుపరి విచారణ జూలై 14 కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. నేటితో సిబిఐకు సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు పూర్తైంది. అవసరాన్ని బట్టి విచారణ గడువును పొడిగిస్తామని గతంలో సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చింది. విచారణ గడువు విషయంలో సిబిఐ ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు.

వివేకా హత్య కేసులో 2021 తొలి ఛార్జ్ షీట్ దాఖలైంది. 2022 జనవరిలో సప్లమెంటరీ ఛార్జ్ షీట్ వేశారు. 2023 జూన్ 30 ఫైనల్ చార్జిషీట్ దాఖలైంది. ఈ కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ ముగియటంతో 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించారు. కేసు విచారణను జులై 14 కు వాయిదా వేశారు.

ఇదే కేసుకు సంబంధించి సునీత వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జులై 3 న విచారించనుంది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సునీత పిటిషన్‌ వేశారు. సునీత పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం విచారించింది. ఈ కేసును జులై 3న తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి సిబిఐతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సునీత పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.

Whats_app_banner