Modi Vizag Schedule : ప్రధాని మోదీ వైజాగ్ టూర్ షెడ్యూల్ ఇదే.. రూ.10,842 కోట్ల పనులకు శ్రీకారం-pm modi to launch 10850 crore worth projects in visakhapatnam here is prime minister tour schedule ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Pm Modi To Launch 10850 Crore Worth Projects In Visakhapatnam Here Is Prime Minister Tour Schedule

Modi Vizag Schedule : ప్రధాని మోదీ వైజాగ్ టూర్ షెడ్యూల్ ఇదే.. రూ.10,842 కోట్ల పనులకు శ్రీకారం

HT Telugu Desk HT Telugu
Nov 03, 2022 04:48 PM IST

PM Modi Visakhapatnam Tour Schedule : ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. నవంబర్ 12వ తేదీన రూ.10,842.47 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

ప్రధాని మోదీతో సీఎం జగన్(ఫైల్ ఫొటో)
ప్రధాని మోదీతో సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ(PM Modi) విశాఖకు రానున్నారు. నవంబర్ 11వ తేదీ సాయంత్రం ప్రధాని ఇక్కడికి చేరుకోనుండగా, మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM Jagan) విశాఖకు వస్తారు. 12వ తేదీన రూ.10,842.47 కోట్ల విలువైన ప్రాజెక్ట్ పనులను ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన వర్చువల్ మోడ్‌లో ఉంటుంది. వాటిలో రెండు రైల్వే ప్రాజెక్టులు, పెట్రోలియం, సహజ వాయువు, మూడు రోడ్డు రవాణా, హైవేలు, ఒక మత్స్యకార ప్రాజెక్ట్ ఉన్నాయి.

ఇవి కాకుండా మరో రెండు రోజుల్లో మరో ఆరు ప్రాజెక్టుల ప్రారంభానికి ప్రధానమంత్రి కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టాక విశాఖ(Visakha) రావడం మూడోసారి. నవంబర్ 11న సీఎం జగన్(CM Jagan) విశాఖకు చేరుకుంటారు. ప్రధానితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11వ తేదీ రాత్రి 7 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు.

ఐఎన్ఎస్ డేగా నుంచి నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి మోదీ, సీఎం జగన్ వెళ్తారు. ఈఎన్సీ అధికారులతో రక్షణ రంగంపై మాట్లాడతారు. రాత్రి అక్కడే బస ఉంటుంది. నవంబర్ 12వ తేదీన ఉదయం ఏయూ గ్రౌండ్(AU Ground)కి వెళ్తారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఏయూలో జరిగే వేదిక నుంచే కీలక అభివృధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం చుడతారు. అనంతరం ఏయూ గ్రౌండ్ నుండి మ.2 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని ప్రధాని ప్రత్యేక విమానంలో దిల్లీ(Delhi) బయల్దేరుతారు.

విశాఖలో దక్షిణ కోస్తా రైల్వేజోన్(Railway Zone) ప్రధాన కార్యాలయ నిర్మాణానికి మోదీ, జగన్ శంకుస్థాపన చేస్తారు. సుమారు రూ.120 కోట్లతో ఈజోన్ ను నిర్మించే అవకాశం ఉంది. విశాఖ శివారు వడ్లపూడి(Vadlapudi)లోని రైల్వే అనుబంధ సంబందిత సంస్థ ఆర్ఎన్ఎల్ రూ.260 కోట్ల వ్యయంతో నిర్మించిన వ్యాగన్ ను జాతికి అంకితం చేస్తారు. దాదాపు రూ.26 వేల కోట్ల వ్యయంతో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) చేపట్టిన రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టుని కూడా ప్రారంభిస్తారు.

IPL_Entry_Point