AP Job Notification : ఏపీ గురుకులాల్లో ఐఐటీ, నీట్ కోచింగ్ కోసం అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్
AP Job Notification : ఏపీ గురుకులాల్లో ఐఐటీ, నీట్ కోచింగ్ కోసం అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు దాఖలకు సెప్టెంబర్ 20వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. గురుకులాలకు సంబంధించిన ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లలో వివిధ సబ్జెక్టులను బోధించేందుకు.. కాంట్రాక్ట్ పద్ధతిలో అధ్యాపకుల భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు దాఖలు చేసుకోవాలని అధికారులు సూచించారు. సెప్టెంబర్ 20వ తేదీలోపు గూగుల్ ఫారంలో వివరాలు నింపి.. అప్లై చేసుకోవాలని.. సెప్టెంబర్ 24న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు.
పూర్తి వివరాలు..HT
మాథ్యమెటిక్స్, మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల బోధనకు అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తులు చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి, వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంపికైన వారికి పోస్టింగ్ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు చీపురపల్లి (విజయనగరం), శ్రీకృష్ణాపురం (విశాఖపట్నం), పిఠాపురం (కాకినాడ), ద్యారకా తిరుమల (మశ్చిమ గోదావరి), ఈడుపుగల్లు (కృష్ణా), అడవి తక్కెళ్లపాడు (గుంటూరు), సింగరాయకొండ (ప్రకాశం), కుప్పం (చిత్తూరు), బి.పప్పూర్ (అనంతపురం), చిన్నటేకూరు (కర్నూలు) సెంటర్లలో పని చేయాల్సి ఉంటుంది.
ఆయా సబ్జెక్టుల్లో బోధించేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్టు చేస్తారు. షార్ట్‌లిస్టు అయిన వారికి ఇంటర్వ్యూ సమాచారం తెలియజేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు సెప్టెంబర్ 24న ఈడుపుగల్లులోని బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో డెమో క్లాసులు, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూలో ఎంపిక అయిన తరువాత వారి అర్హతలు, అనుభవం ఆధారంగా జీతం ఇస్తారు. ఈ గూగుల్ లింక్ https://docs.google.com/forms/d/e/1FAIpQLSf8_JSJQp3A3UjZGPKGMD-547asbI1zfXhsKBmwnbfc-9Bg4w/viewform లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లోని సంబంధిత సబ్జెక్టులను బోధించాల్సి ఉంటుంది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)