Kodi Kathi Case : జగన్‌పై కోడికత్తి దాడి కేసులో కుట్ర లేదన్న ఎన్ఐఏ-nia counter petition in the case of the attack on ys jagan at visakhapatnam airport ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kodi Kathi Case : జగన్‌పై కోడికత్తి దాడి కేసులో కుట్ర లేదన్న ఎన్ఐఏ

Kodi Kathi Case : జగన్‌పై కోడికత్తి దాడి కేసులో కుట్ర లేదన్న ఎన్ఐఏ

HT Telugu Desk HT Telugu
Apr 13, 2023 03:56 PM IST

Attack on ys jagan Case Updates: జగన్ పై కోడికత్తి దాడి ఘటనలో కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్‌కు అసలు ఈ ఘటనతో సంబంధం లేదని పేర్కొంది.ఈ మేరకు కోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్ దాఖలు చేసింది.

విశాఖ విమానాశ్రయంలో జగన్ (ఫైల్ ఫొటో)
విశాఖ విమానాశ్రయంలో జగన్ (ఫైల్ ఫొటో)

Attack on ys jagan at visakhapatnam Airport: వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తి ఘటనలో కుట్రకోణం లేదని తేల్చింది ఎన్ఐఏ. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‍కు ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేసింది. నిందితుడు శ్రీనివాసరావు.. టీడీపీ సానుభూతిపరుడు కాదని చెప్పుకొచ్చింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని ఎన్ఐఏ కోరింది. జగన్ వేసిన పిటిషన్‍ను కొట్టి వేయాలని ఎన్ఐఏ కోరింది. ఈ మేరకు కోడికత్తి కేసులో కౌంటర్ దాఖలు చేసింది. అయితే ఎన్ఐఏ వాదనలపై తమకు సమయం కావాలని జగన్ తరపు న్యాయవాదులు కోరారు. ఇరవైపు వాదనలు విన్న న్యాయస్థానం... కోడికత్తి కేసు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

కేసు నేపథ్యం…?

2018లో విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత, సీఎం జగన్‌పై జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు. అప్పట్లో జగన్ ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నారు. సిబిఐ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో కోర్టుకు హాజరుకావ్వాల్సి ఉండేది. అందుకే గురువారం మధ్యాహ్నం కల్లా ఆయన పాదాయత్ర ముగించుకుని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్లేవారు.

జగన్ విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన సమయంలో అక్కడి క్యాంటీన్‌లో పనిచేసే శ్రీను అనే వ్యక్తి వీఐపీ లాంజ్‌లోకి వెళ్లి టీ, కాఫీలు అందించే ఉద్దేశంతో కోడికత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. చిన్న గాయంతో జగన్ బయటపడ్డారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకున్నారు. వైద్యులు ఆయనకు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. జగన్ విజ్ఞప్తిపై ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించారు. ఫలితంగా ఈ కేసు విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగింది ఎన్ఐఏ. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్సనల్ పీఏ కోర్టుకు హాజరయ్యారు. అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదుకు సీఎం జగన్ పిటిషన్ వేశారు. ఎన్ఏఐ కోర్టులో సీఎం జగన్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే రాష్ట్రానికి సీఎంగా బాధ్యతల నిర్వహణ ఉందని పిటిషన్‍లో వెల్లడించారు.

ఎన్ఐఏ తాజా వాదనల నేపథ్యంలో… జగన్ తరపు న్యాయవాదులు ఎలా ముందుకెళ్తరనేది ఆసక్తికరంగా మారింది. 17వ తేదీన కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది.