Nijam Gelavali Yatra : ఎన్టీఆర్ పౌరుషం, చంద్రబాబు ఇచ్చిన క్రమశిక్షణతో పోరాడుదాం - నారా భువనేశ్వరి
Bhuvaneswari Nijam Gelavali Yatra : నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? అని ప్రశ్నించారు నారా భువనేశ్వరి. చంద్రబాబు రాసిన లేఖపై కాదు..అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. తిరుపతిలో ‘నిజం గెలవాలి’ సభలో మాట్లాడిన ఆమె… ఎండుతున్న పోలాలకు నీళ్లివ్వండి అంటూ కామెంట్స్ చేశారు.
Nara Bhuvaneswari Nijam Gelavali Yatra : నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా.. మన బిడ్డలకు ఒక్క ఉద్యోగమైనా అని నారా భువనేశ్వరి ప్రశ్నించారు. వేధించడం, ఇబ్బందులు పెట్టడం గొప్ప అనుకుంటున్నారని మండిపడ్డారు. నిరాహార దీక్షలు చేసిన వారిపై హత్యాయత్నం కేసులు కాదు...ఎండుతున్న పోలాలకు నీళ్లివ్వండిని సూచించారు. ప్రభుత్వ దృష్టి చంద్రబాబు రాసిన లేఖపై కాదని, అభివృద్ధిపై పెట్టాలన్నారు భువనేశ్వరి.
‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తిరుపతిలోని అంకుర ఆసుపత్రి పక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గురువారం ప్రసంగించారు. చంద్రబాబు అరెస్టుతో నలుగురం నాలుగు దిక్కులయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును నిర్బంధించి 48 రోజులు అయిందని…. మనవడు దేవాన్ష్ ను చూడక 48 రోజులు అయిందన్నారు. తిరుపతిని ఎన్టీఆర్ ఎలా అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసని చెప్పారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో నిత్యాన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలను కూడా చంద్రబాబు అభివృద్ది చేశారని… భక్తి కోసం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తే ప్రశాంతతో ఉంటారని అభివృద్ది చేశారని చెప్పారు.
“2014లో చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అనంతపురం జిల్లాను ఆటోమెబైల్ హబ్ గా మార్చారు. చిత్తూరు జిల్లాను ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దారు. గతంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్లో ఇప్పుడు ఒకటి రెండు తప్ప అన్నీ రాష్ట్రం నుండి వెళ్లిపోయాయి. మన రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. మన రాష్ట్ర యువతకు రావాల్సిన ఉద్యోగాలున్నీ పక్క రాష్ట్రాల యువతకు పోతున్నాయి. అమర్ రాజా బ్యాటరీస్ ఈ జిల్లాలో 30 ఏళ్లుగా ఉంది..వాళ్లనూ ఇబ్బందలు పెట్టారు. రూ.9,300 కోట్ల పెట్టుబడిని తెలంగాణలో పెట్టారు..దీంతో అక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించారు. నేను కూడా హెరిటేజ్ నిడిపిస్తున్నా..ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో హెరిటేజ్ ఉంది. మమ్మల్ని వాళ్లు ఆహ్వానించి పరిశ్రమకు ఏం కావాలో అడుతారు..అన్నీ ఇచ్చి పెట్టుబడుల్లో ముందుకు తీసుకెళ్తారు. ఏనాడూ మమ్మల్ని భయపెట్టలేదు. చంద్రబాబు ఉమ్మడి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ కు ఐఎస్బీ తీసుకొచ్చారు.” అని గుర్తు చేశారు భువనేశ్వరి.
"శ్రీకాళహస్తిలో దీక్షలు చేస్తే కేసులు పెట్టారు. ఇదా రాష్ట్ర గొప్పతనం.? మన రాష్ట్రం ఎలా అవుతుందో...భవిష్యత్ ఏంటో అంతా ఆలోచించాలి. నా పోరాటంలో మహాత్మ గుర్తొస్తున్నారు. ఆయన స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు.. మనం ఇప్పుడు రాష్ట్రంలో ఈ ప్రభుత్వంతో స్వతంత్రం కోసం పోరాడుతున్నాం. ఈ కార్యక్రమానికి నేను రాకముందు చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించాలని చంద్రబాబు చెప్పారు. టీడీపీ ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని చెప్పారు. నిన్న, ఇవాళ చూశాను..లక్షల మందికి ఆయనపై అభిమానం ఉంది..అది ఆయనపై మీకున్న నమ్మకం..ఇందుకు నాకు చాలా గర్వంగా ఉంది. కలిసి కట్టుగా నడుం బిగించి ఎన్టీఆర్ ఇచ్చిన పౌరుషంతో, చంద్రబాబు ఇచ్చిన క్రమశిక్షణతో పోరాడుదాం.’’ అని భువనేశ్వరి పిలుపునిచ్చారు.