Ysrcp to Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్దర్
Ysrcp to Congress: ఎన్నికల వేళ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరి కలకలం సృష్టించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ వైసీపీని వీడారు.
Ysrcp to Congress: నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే YCP Mla ఆర్ధర్ Ardarఆ పార్టీని వీడారు. వైసీపీ నియోజక వర్గ సమన్వయకర్తల మార్పుతో ఆర్దర్ పార్టీని వీడుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. నందికొట్కూరు రిజర్వుడు నియోజక వర్గంలో డాక్టర్ దారా సుదీర్‌ను సమన్వయకర్తగా నియమించారు. దీనిపై ఆర్దర్ అభ్యంతరాలను పార్టీ పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆయన వైసీపీని వీడి Congress కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో Nandikotkur Mla ఆర్దర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గమైన నందికొట్కూరులో ఆర్ధర్ వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి గెలిచారు. సమీప ప్రత్యర‌్థి టీడీపీ అభ్యర్ధి బండి జయరాజ్‌పై ఆర్దర్ 38,691 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
2009లో జరిగిన నియోజక వర్గాల పునర్విభజనతో నందికొట్కూరు రిజర్వుడు నియోజక వర్గంగా మారింది. మాజీ పోలీస్ అధికారి ఆర్దర్ వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. నందికొట్కూరు రిజర్వుడు నియోజక వర్గం కావడంతో స్థానికంగా భైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి నియోజక వర్గంలో పెత్తనం చేయడానికి ప్రయత్నించడం వివాదానికి కారణమైంది.
రిజర్వుడు నియోజక వర్గంగా మారక ముందు నందికొట్కూరులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారు. ఆర్దర్ గెలిచిన తర్వాత స్థానిక పెద్దలకు తలొగ్గి పనిచేయడంపై వివాదాలు మొదలయ్యాయి. పార్టీ పెద్దలు కూడా బైరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఆర్దర్ మిన్నకుండిపోయారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ కూడా తనకు దక్కడం లేదని పలుమార్లు ఆరోపించారు.
ఆర్దర్‌కు టిక్కెట్ ఇవ్వొద్దని స్థానిక నేతలు ఒత్తిడి చేయడంతో ఆర్దర్ స్థానంలో స్థానికేతరుడైన సుదీర్‌ను సమన్వయకర్తగా ప్రకటించారు. దీంతో ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్దర్‌తో పాటు మరికొందరు ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత కథనం