AP Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్.. రాగల మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు… బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం-low pressure effect heavy rains in ap in coming three days ongoing cycle in bay of bengal ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్.. రాగల మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు… బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం

AP Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్.. రాగల మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు… బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం

Sarath chandra.B HT Telugu
Jul 17, 2024 05:53 AM IST

AP Weather Updates: ఆంధ్రప్రదేశ్‌ అంతట వానలు దంచి కొడుతున్నాయి. జూలైలో మొదటి రెండు వారాల్లో నిరాశపరిచిన వరుణదేవుడు కరుణించడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వానలే వానలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వానలే వానలు (Hindustan Times)

AP Weather Updates: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఐఎండి సూచనల ప్రకారం విదర్భకు ఆనుకొని ఉన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందన్నారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
yearly horoscope entry point

వీటి ప్రభావంతో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, గురు,శుక్రవారాల్లో రెండు మూడుచోట్ల అతిభారీ వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

రానున్న నాలుగు రోజులలో ఏపీ వాతావరణం…..

17 జూలై, బుధవారం :

• శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• విజయనగరం, అనకాపల్లి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

18 జూలై, గురువారం :

• అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

19 జూలై, శుక్రవారం :

• అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

• విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• అనకాపల్లి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

20 జూలై, శనివారం :

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Whats_app_banner