Ratha Sapthami: జనవరి 28న తిరుమలలో రథసప్తమి
Ratha Sapthami రథసప్తమి సందర్భంగా తిరుమలలో వేంకటేశ్వర స్వామి వారు ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్య జయంతి సందర్భంగా జనవరి 28న తిరుమలలో రథసప్తమిని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
Ratha Sapthami రథసప్తమి పర్వదినాన తిరుమల శ్రీవారు ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్య జయంతి సందర్భంగా జనవరి 28వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో రథ సప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
జనవరి 28వ తేదీన ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై దర్శనమిస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనంపై స్వామి వారు విహరిస్తారు.
ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు - హనుమంత వాహనంపై కనిపిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు - చక్రస్నానంలో ఉంటారు.
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనంపై విహరిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనంపై స్వామి వారు భక్తులకు కనిపిస్తారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై ఉంటారు.
రథసప్తమి కారణంగా తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
టాపిక్