P Gannavaram Accident : పి.గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం- కూలీలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, నలుగురు దుర్మరణం!-konaseema district p gannavaram apsrtc bus lorry accident couple of people died on spot ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  P Gannavaram Accident : పి.గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం- కూలీలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, నలుగురు దుర్మరణం!

P Gannavaram Accident : పి.గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం- కూలీలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, నలుగురు దుర్మరణం!

Bandaru Satyaprasad HT Telugu
May 14, 2024 09:38 PM IST

P Gannavaram Accident : కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందారు.

పి.గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం
పి.గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం

P Gannavaram Accident : అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద రోడ్డుపై ట్రాక్టర్ లో ధాన్యం బస్తాలు లోడ్ చేస్తున్న కూలీలను ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం చెందారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు రాజోలు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురిది జి.పెద్దపూడి, మరొకరిది ఆదిమూలవారిపాలెంగా తెలుస్తోంది. బస్సుల్లో ప్రయాణికులకు సైతం స్వల్పంగా గాయాలయ్యాయి. వీరిని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

యూపీలో ఘోర ప్రమాదం

ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి హాపూర్‌ జిల్లాలోని నేషనల్‌ హైవేపై అల్లాభక్ష్‌పూర్‌ టోల్‌ప్లాజా సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. పోలీసులు తీవ్రంగా శ్రమించి కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు. మృతులందరూ ఘజియాబాద్‌కి చెందినవారని పోలీసులు గుర్తించారు. వారు కారులో మొరాదాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

బస్సు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు

పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన కుటుంబం మొత్తం రోడ్డు ప్రమాదానికి బలైంది. ఓటు వేయడానికి సొంతూరు వెళుతున్న దంపతులతో పాటు వారి ఎనిమిదేళ్ల వారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. జాతీయ రహదారి వెంట ఉన్న మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌‌ దగ్గర నిలబడి టిఫిన్ చేస్తుండగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు వారి ప్రాణాలను బలి తీసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారిలో జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వరంగల్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోటకు చెందిన తెలకలపల్లి రవీందర్‌, జ్యోతి దంపతులు హైదరాబాద్‌ బీబీనగర్‌లో నివాసం ఉంటున్నారు.

స్థానికంగా పాత సామగ్రి విక్రయించే స్క్రాప్ వ్యాపారం చేస్తున్నారు. గత నెలలో స్కూళ్లకు సెలవులివ్వడంతో పన్నెండేళ్ల కుమారుడిని వరంగల్‌లో ఉంటున్న రవీందర్‌ తల్లిదండ్రుల వద్దకు పంపారు. సోమవారం సొంతూరులో ఓటు వేసేందుకు రవీందర్‌, జ్యోతి దంపతులు.. కుమారుడు భవిష్‌తో కలిసి కలిసి స్కూటీపై బీబీనగర్‌ నుంచి వరంగల్‌ బయల్దేరారు. ఉదయం రఘునాథపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌‌లో టిఫిన్ తినడానికి ఆగారు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న వరంగల్‌-1 ఆర్టీసీ డిపోకు చెందిన రాజధాని బస్సు అదుపు తప్పింది. ముందు వెళ్లే వాహనాలను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్‌ ముందున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రవీందర్‌ జనగామ ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడు. వారి చిన్న కుమారుడు భవిష్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చనిపోయాడు. ప్రమాదంలో టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకులు నునావత్‌ నవీన్‌, శ్రీకాంత్‌, రాకేశ్‌‌తో పాటు మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం