TTD: నేటి నుంచే బ్రేక్ దర్శనంలో మార్పులు.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలివే..-key decisions taken in ttd trust board meeting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Key Decisions Taken In Ttd Trust Board Meeting

TTD: నేటి నుంచే బ్రేక్ దర్శనంలో మార్పులు.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలివే..

HT Telugu Desk HT Telugu
Dec 01, 2022 07:34 AM IST

TTD Board Meeting: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. తిరుమలలో బుధవారం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో.. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని నిర్ణయించారు. దీనితో పాటు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

టీటీడీ బోర్డు మీటింగ్
టీటీడీ బోర్డు మీటింగ్

TTD Board Meeting Updates: టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన భేటీ అనంతరం వివరాలను వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం స్వర్ణమయం చేయాలని, అందుకు భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారంతో తాపడం చేయించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 23వ తేదీన బాలాలయం పనులు ప్రారంభం అవుతాయని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

6 నెలల కాల పరిధిలో బంగారు తాపడం పనులు పూర్తి చేస్తామని టీటీడీ ఛైర్మన్ చెప్పారు. బంగారు తాపడం పనులు నిర్వహిస్తున్న సమయంలో దర్శన విధానంలో మార్పులు ఉండవన్నారు. ఇక జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. గత ఏడాది తరహాలోనే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నట్టు వివరించారు.

జనవరి 2, 2023 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం మొదలుకానుంది. 11వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ అనుమతించనుంది.

డిసెంబర్ 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్య ప్రారంభించనున్నారు.

నందకం అతిధి గృహంలో 2.95 కోట్లతో ఆధునాతనమైన ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి.

ఘాట్ రోడ్డులో 9 కోట్ల రూపాయల వ్యయంతో క్రాష్ బ్యారియర్స్ ఏర్పాటుతో పాటు బాలాజీకాలనీలో 3 కోట్ల రూపాయల వ్యయంతో స్థానికుల నివాసాలకు మరమత్తులు.

రూ. 3.8 కోట్ల రూపాయల వ్యయంతో పద్మావతి అతిథి గృహంలో గదులు మరమత్తులు రూ. 3.3 కోట్ల రూపాయల వ్యయంతో స్వీమ్స్ హస్పిటల్‌లో హాస్టల్‌ గదులు నిర్మాణం.

తిరుపతిలోని తాతాయ్యగుంట అమ్మవారి ఆలయ అభివృద్ది కోసం 3.7 కోట్లు కేటాయించినట్లు వెల్లడి.

ఉద్యోగులుకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయం.

కాంట్రాక్ట్ ఉద్యోగులుకు జీతాలు పెంపుపై అధ్యయనం కోసం ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ ప్రకటించారు.

IPL_Entry_Point