Tirumala Laddu Size : శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దు… టీటీడీ-ttd clarification on tirumala laddu size and quality ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd Clarification On Tirumala Laddu Size And Quality

Tirumala Laddu Size : శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దు… టీటీడీ

HT Telugu Desk HT Telugu
Nov 11, 2022 12:37 PM IST

Tirumala Laddu Size తిరుమల శ్రీవారి లడ్డు పరిమాణం, బరువుపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదని టీటీడీ ప్రకటించింది. లడ్డూ 160-180 గ్రాముల బరువుంటుందని స్పష్టం చేసింది. లడ్డూ తయారీపై రకరకాల ప్రచారాలు జరుగుతుండటంతో టీటీడీ వివరణ ఇచ్చింది. ఓ భక్తుడు లడ్డుపరిణామం తగ్గిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో టీటీడీ వివరణ ఇచ్చింది.

తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీపై టీటీడీ వివరణ
తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీపై టీటీడీ వివరణ

Tirumala Laddu Size తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుండి 180 గ్రాములు బరువు కలిగి వుంటుందని, లడ్డూర తయారీపై ఎలాంటి అపోహలు అవసరం లేదని టీటీడీ స్పష్టం చేసింది. ప్ర‌తి రోజు పోటు కార్మికులు త‌యారు చేసిన ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను ఒక ప్ర‌త్యేక‌ ట్రేలో ఉంచి, ప్ర‌తి ట్రే బ‌రువును పోటు అధికారులు త‌నిఖీ చేస్తారని, అనంత‌రం ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను కౌంట‌ర్ల‌కు త‌ర‌లించి, భ‌క్తుల‌కు అందిస్తారని ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పార‌ద‌ర్శ‌క‌తతో జరుగుతుందని ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

ఇటీవల కొన్ని లడ్డూలు తక్కువ బరువుగా కనిపించడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ చోట బరువు చూసే యంత్రంలో సాంకేతిక‌ సమస్య కారణంగా మైనస్ 70 అని ఉండటంతో, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం కార‌ణంగా లడ్డూ బరువుపై భ‌క్తులు అపోహల‌కు గుర‌య్యారని చెప్పారు. లడ్డూ బరువు కచ్చితంగా 160 నుండి 180 గ్రాములు ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. కొన్ని వందల సంవత్సరాలుగా అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారని. అదేవిధంగా ల‌డ్డూ బ‌రువు, నాణ్య‌త విష‌యంలో కూడా టీటీడీ ఏనాడు రాజీ ప‌డ‌లేదని స్పష్టం చేశారు.

సాధార‌ణంగా ల‌డ్డూ కౌంట‌ర్ల వ‌ద్ద ఏదైనా ఇబ్బంది త‌లెత్తితే అక్క‌డ అందుబాటులో ఉన్న ల‌డ్డూ కౌంట‌ర్ అధికారికి తెలియ‌జేస్తే, అక్క‌డిక్క‌డే స‌మ‌స్యను ప‌రిష్క‌రించే వ్య‌వ‌స్థ టీటీడీలో ఉందని, భ‌క్తుడు ఇవి ఏమి చేయ‌కుండా సోష‌ల్ మీడియాలో టీటీడీపై ఆరోప‌ణ‌లు చేయ‌డంశోచనీయమన్నారు. భ‌క్తుడు ఆరోపించిన‌ట్లు ల‌డ్డూ పరిమాణం, బరువులో ఎలాంటి వ్య‌త్యాసం లేదు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలను భక్తులు నమ్మవద్దని టీటీడీ కోరింది.

విశాఖ బీచ్‌లో కార్తీక దీపోత్సవం…..

విశాఖపట్నం ఆర్ కె బీచ్ లో నవంబరు 14 వ తేదీ టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవం కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు,దాతలు, శ్రీవారి సేవకులు సమష్టిగా పనిచేసి విజయవంతం చేద్దామని టీటీడీ జెఈవో సదా భార్గవి పిలుపు నిచ్చారు.

ఆర్ కె బీచ్ లోని కాళిక అమ్మవారి ఆలయం ఎదురుగా బీచ్ లో కార్తీక మహాదీపోత్సవం నిర్వహించే స్థలాన్ని అధికారులతో కలసి పరిశీలించారు. వేదిక నిర్మాణం , బారికేడ్లు, భక్తులు వచ్చీ పోయేందుకు ఏర్పాటు చేయాల్సిన మార్గాల గురించి అధికారులతో చర్చించారు. భక్తుల భద్రత , దీపాల ఏర్పాటు,పాసుల జారీ, ప్రసాద వితరణ అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

టీటీడీ కళ్యాణమండపంలో దాతలు, నిర్వాహకులు, అధికారులతో సమీక్షించారు. 2020లో లోకక్షేమం, హిందూ ధార్మిక ప్రచారం కోసం టీటీడీ కార్తీక మహా దీపోత్సవం కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగానే 14వ తేదీ విశాఖ లో మూడోసారి ఈ కార్యక్రమం నిర్వహణకు ముందుకు వచ్చిందన్నారు. గత ఏడాదికంటే మరింత ఘనంగా దీపోత్సవం నిర్వహణకు దాతలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో పాల్గొనడానికి 2500 పాసులు జారీ చేస్తున్నామని ఒక పాసుమీద నలుగురిని అనుమతిస్తామన్నారు.

14వ తేదీ ఉదయం కళ్యాణమండపం నుంచి వేదిక వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వెళతామని చెప్పారు. సాయంత్రం 5-30 నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు

IPL_Entry_Point

టాపిక్