IRCTC Ooty Tour : తిరుపతి నుంచి ఊటీ టూర్... అతి తక్కువ ధరలోనే 6 రోజుల ప్యాకేజీ - పూర్తి వివరాలివే
IRCTC Tirupati - Ooty Tour : ఊటీకి వెళ్లాలని ఉందా? అయితే మీకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి నుంచి ఊటీకి సరికొత్త ప్యాకేజీ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
IRCTC Tourism Ooty Package: కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేస్తున్నారా… ?కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా తిరుపతి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX TIRUPATI ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ అక్టోబర్ 10, 2023 తేదీన అందుబాటులో ఉంది.
టూర్ షెడ్యూల్ :
Day - 01 తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11.50 గంటలకు ట్రైన్(శబరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ నెం- 17230) బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
Day - 02 ఉదయం 08.02 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి వెళ్తారు. హోటల్ కి చెకిన్ అయిన తర్వాత... మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఊటీ లేక్ చూస్తారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.
Day - 03 బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత దొడబెట్ట, టీ మ్యూజియం, పైకార ఫాల్స్ కు వెళ్తారు. రాత్రి కూడా ఊటీలోనే బస చేస్తారు.
Day - 04 బ్రేక్ ఫాస్ట్ తర్వాత కున్నూరుకు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు. రాత్రి ఊటీలోనే ఉంటారు.
Day - 05 : హోటల్ నుంచి కోయంబత్తూరు వెళ్తారు. సాయంత్రం 04.35 నిమిషాలకు రైలు ప్రయాణం మొదలవుతుంది.
Day - 06 రాత్రి 12.05 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.
టికెట్ ధరల వివరాలు:
ఈ ఊటీ ప్యాకేజీ చూస్తే… కంఫర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 30,120ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 16,130ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.12,580గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. . ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు(IRCTC - Tourism Information and Facilitation Centre) :
విజయవాడ రైల్వే స్టేషన్:- 8287932312
తిరుపతి రైల్వే స్టేషన్: - 8287932317