NATA 2024: నేషనల్ ఆప్టిట్యూట్ టెస్ట్‌ ఫర్ ఆర్కిటెక్చర్‌‌కు దరఖాస్తు చేశారా?-have you applied for the national aptitude test for architecture 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nata 2024: నేషనల్ ఆప్టిట్యూట్ టెస్ట్‌ ఫర్ ఆర్కిటెక్చర్‌‌కు దరఖాస్తు చేశారా?

NATA 2024: నేషనల్ ఆప్టిట్యూట్ టెస్ట్‌ ఫర్ ఆర్కిటెక్చర్‌‌కు దరఖాస్తు చేశారా?

Sarath chandra.B HT Telugu
Apr 01, 2024 10:19 AM IST

NATA 2024: నిర్మాణ రంగంలో కీలకమైన ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్‌ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ ఫర్ ఆర్కిటెక్చర్‌ కోర్సును ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 6న నాటా 2024 ప్రవేశ పరీక్ష
ఏప్రిల్ 6న నాటా 2024 ప్రవేశ పరీక్ష

NATA 2024: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష NATA 2024 పరీక్షకు గడువు Entrance Exam సమీపిస్తోంది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో నాటా 2024 నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా ఐదేళ్ల కోర్సులో ప్రవేశాలను కల్పిస్తారు.

yearly horoscope entry point

NATA 2024: 2024-25 విద్యా సంవత్సరంలో ఐదేళ్ల ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 6న నిర్వహిస్తున్నారు. ఇప్పటికే NATA 2024 రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌లో ప్రారంభం అయ్యాయి. మొదటి సంవత్సరం బిఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు NATA 2024 ప్రవేశ పరీక్షలో అర్హత అవసరం.

నాటా 2024కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు 10 ప్లస్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ తత్సమాన పరీక్షలకు హాజరైన వారు, పాసైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో మ్యాథ్స్‌ చదివిని కూడా నాటాకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒకసారి నాటా పరీక్షలకు హాజరైన వారికి రెండేళ్ల పాటు స్కోర్ చెల్లుబాటులో ఉంటుంది. నాటా ద్వారా బిఆర్క్‌లో ప్రవేశాలకు అనుమతించే విద్యా సంస్థల జాబితా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలకు www.nata.in లో అందుబాటులో ఉంది. విద్యార్ధులు సందేహాలకు nataexam2024@gmail.com లేదా హెల్ప్‌ డెస్క్‌ 08045549467లలో సంప్రదించవచ్చు.

కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ‌ ఎడ్యుకేషన్‌ అనుబంధ సంస్థగా ఉన్న కౌన్సిల్ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ 1972లో ఏర్పాటైంది. ఉన్నత విద్యలో ఉన్నత ప్రమాణాల లక్ష్యంగా ఈ సంస్థను భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆర్కిటెక్చర్ విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు.

నిర్మాణ రంగంలో అత్యున్నత స్థాయి పరిజ్ఞానాన్ని, నిపుణులైన ఆర్కిటెక్చర్లను తయారు చేయడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 375కు పైగా విద్యా సంస్థలు కౌన్సిల్‌కు అనుబంధంగా ఉన్నాయి. ఆర్కిటెక్చర్ కోర్సులను అందించే కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలను కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది.

యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్శిటీలు, అనుబంధ కాలేజీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, స్వతంత్ర సంస్థల్లో ఆర్కిటెక్చర్ కోర్సులకు రూపకల్పన చేస్తుంది. దేశ వ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను 2006 నుంచి నిర్వహిస్తున్నారు. విద్యార్ధుల సామర్థ్యాలను అంచనా వేయడం ద్వారా ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

నాటా 2024 పరీక్షను ఏప్రిల్ 6వ తేదీన నిర్వహిస్తారు. ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి నాలుగున్నర వరకు మరో సెషన్ నిర్వహిస్తారు.

Whats_app_banner