Guntur Paramedical Posts : గుంటూరు జిల్లాలో 94 పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఇలా అప్లై చేసుకోండి!-guntur news in telugu govt hospitals paramedical jobs notification last date december 30th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guntur Paramedical Posts : గుంటూరు జిల్లాలో 94 పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఇలా అప్లై చేసుకోండి!

Guntur Paramedical Posts : గుంటూరు జిల్లాలో 94 పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఇలా అప్లై చేసుకోండి!

Bandaru Satyaprasad HT Telugu
Dec 25, 2023 03:26 PM IST

Guntur Paramedical Posts : గుంటూరు జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో 94 పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదలైంది. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గుంటూరు జీజీహెచ్ లో ఉద్యోగాలు
గుంటూరు జీజీహెచ్ లో ఉద్యోగాలు

Guntur Paramedical Posts : గుంటూరు జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం 94 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి 7వ తరగతి, టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా విద్యార్హత కలిగి ఉండాలి. అర్హులైన వారు డిసెంబరు 30వ తేదీ నాటికి దరఖాస్తులను The Principal Office , Government Medical College, Guntur అడ్రస్ పంపించాలి.

వయోపరిమితి సడలింపు

గుంటూరు జీఎంసీ, జీజీహెచ్‌, ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో ఖాళీలున్నాయి. వివిధ పోస్టులకు అనుగుణంగా వయోపరిమితి 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ , ఆర్మీ సర్వీసు వాళ్లకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో పరిమితి సడలింపులు ఉన్నాయి. అర్హులైన ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. విద్యార్హతలు, అకడమిక్ మార్కులు, వెయిటేజీ, ఇతర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ లో అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత సంబంధిత ధ్రువపత్రాలను The Principal Office , Government Medical College, Guntur చిరునామాకు పోస్టు చేయాలి.

ముఖ్యమైన తేదీలు

ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని అంశాలు పరిశీలన అనంతరం జనవరి 24, 2024న అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల చేస్తారు. జనవరి 29న ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 6న కౌన్సెలింగ్, పోస్టింగ్ వివరాలు ప్రకటించారు.

Whats_app_banner