AP Study Circle: ఏపీ స్టడీ సర్కిల్లో సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు ఉచిత కోచింగ్
AP Study Circle: ఏపీ స్టడీ సర్కిల్ ప్రాంతీయ కేంద్రాల ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణఇస్తున్నట్లు ప్రకటించారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే సివిల్స్‌తో పాటు ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
AP Study Circle: ఆంధ్రప్రదేశ్ స్టడీసర్కిల్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే పలు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఏపీ స్టడీ సర్కిల్ ప్రాంతీయ కేంద్రాల్లో ఈ పోటీ పరీక్షలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ 2023 పరీక్షలతో పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు శిక్షణనుఉచితంగా అందిస్తారు.
ఏపీస్టడీసర్కిల్అందించే శిక్షణా కార్యక్రమాల్లో సివిల్స్ కోచింగ్ తరగతులు విశాఖపట్నంలో నిర్వహిస్తారు. గ్రూప్ 1కు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలను విజయవాడలో నిర్వహిస్తారు. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన శిక్షణను తిరుపతిలో నిర్వహిస్తారు.
ఏపీస్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణా కార్యక్రమాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన వారై ఉండాలి.అభ్యర్థి ఏదైనాసబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వార్షికాదాయం ఆరు లక్షల రుపాయలకు మించకూడదు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుకు గరిష్టంగా ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇస్తారు. బీసీలకు మూడేళ్ల పరిమితి కల్పిస్తారు.
శిక్షణా కార్యక్రమాలకు అర్హులైన వారిని పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు https://apstdc.apcfss.in/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ఆగష్టు 5వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.