Araku Road Accident : అరకు లోయలో ఘోర ప్రమాదం.. బైక్స్ ఢీకొని నలుగురు మృతి , విషమంగా మరో ఆరుగురి పరిస్థితి..!
Araku Valley Road Accident Updates: అల్లూరి జిల్లాలోని అరకు లోయలో శుక్రవారం రాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌లు ఢీకొట్టుకున్న ఘటనలో నలుగురు చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అల్లూరు జిల్లా(Alluri Sitharama Raju district) పోలీసులు వివరాల ప్రకారం…. ప్రమాదం జరిగిన సమయంలో నాలుగు బైక్‌లపై 11 మంది ప్రయాణిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా,మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో గాయపడిన మరో ఆరుగురిని ఆసుపత్రికి తరలించగా… పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఒకరికి మాత్రమే స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదం అరకు మండల(Araku Mandal) పరిధిలో ఉంటే మాదల పంచాయతీ పరిధిలో దుమ్మగుడ్రి - గంజాయిగుడ గ్రామాల మధ్య 3 జరిగిందని పోలీసులు వెల్లడించారు. శివరాత్రి సందర్భంగా గంజాయి గూడ జాతరకు బైకులపై వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
"ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దర్యాప్తు చేస్తున్నాం" అని స్థానిక పోలీసులు తెలిపారు.
ప్రైవేటు బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు
Private Bus Accident in Khammam: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూసుమంచి మండలం లోక్యతండ వద్ద తెల్లవారు జామున ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి మల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
హైదరాబాదు నుంచి రాజమండ్రికి బయలుదేరి వెళుతున్న పూరి జగన్నాథ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు కూసుమంచి మండలం లోక్యతండా వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఇటీవలే నిర్మించిన నేషనల్ హైవే పై బస్సు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లోక్యా తండా వద్ద నిర్మించిన ఒక జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరగడంతో బస్సు బ్రిడ్జిపై నుంచి కిందకు పడడంతో ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. డ్రైవర్ కునుకుపాటు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున సరిగ్గా 3:30 గంటల సమయంలో బస్సు వంతెన పైనుంచి కిందికి మల్టీ కొట్టింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేసి క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బస్సు బ్రిడ్జి పైనుంచి పడడంతో భారీగానే దెబ్బతింది. అయితే తీవ్ర గాయాలతో బయటపడిన ప్రయాణికుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాపాయం సంభవించలేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పెను ప్రమాదమే తప్పినట్లు అయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.