AP Govt Jobs 2024 : కృష్ణా జిల్లాలో 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు అక్టోబర్ 22 ఆఖరు తేదీ
కృష్ణా జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో పరిధిలో 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
కృష్ణా జిల్లాలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్, డీఈఓ, టెక్నీషియన్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల 20 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు ఈ నెల 22 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
కృష్ణా జిల్లాలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (ఎన్‌యూహెచ్ఎం) కింద అర్బన్ క్లినిక్‌లు, యూపిహెచ్‌సీలలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డీఈఓ, ఎల్‌జీఎస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
మొత్తం 20 పోస్టులు…
మొత్తం 20 పోస్టులు కాగా…. ఫార్మాసిస్ట్ గ్రేడు-II పోస్టులు 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టులు 4, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులు 10 భర్తీ చేస్తారు. ఇందులో ఫార్మాసిస్ట్ గ్రేడు-II, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలోనూ, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు.
నెలవారీ వేతనం ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉంది. ఫార్మాసిస్ట్ గ్రేడు-II పోస్టుకు రూ.23,393, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుకు రూ.23,393, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు రూ.18,450, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టుకు రూ.15,000 ఉంటుంది.
అర్హతలు :
- ఫార్మాసిస్ట్ గ్రేడు-II పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. డి.ఫార్మాసీ, బి. ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి.
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుకు డిప్లొమా ఎంఎల్‌టీ, బీఎస్సీ ఎంఎల్‌టీ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ ఒకేషనల్ అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది పాటు అప్రంటిస్ పూర్తి చేసి ఉండాలి.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. పీజీడీసీఏ కోర్సు ఉత్తీర్ణత అయి ఉండాలి.
- లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.300, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగు అభ్యర్థులకు రూ.100 ఉంటుంది. అప్లికేషన్ ఫీజును "జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, కృష్ణా జిల్లా" పేరు మీద డీడీ తీయాలి. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తే, ప్రతి పోస్టుకు ఫీజును డీడీ తీయాలి.
అప్లికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s3c399862d3b9d6b76c8436e924a68c45b/uploads/2024/10/2024101630.pdf క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులో వివరాలను నింపు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, డీడీ జత చేసి అక్టోబర్ 22 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, పరసుపేట, మచిలీపట్నం, కృష్ణా జిల్లాలో అందజేయాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం