Kadapa Steel Plant : 30 నెలల్లోపు స్టీల్‌ప్లాంట్‌ తొలి దశ పూర్తి - సీఎం జగన్-cm jagan lays foundation stone for rs 8800 cr jsw steel plant in kadapa district ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kadapa Steel Plant : 30 నెలల్లోపు స్టీల్‌ప్లాంట్‌ తొలి దశ పూర్తి - సీఎం జగన్

Kadapa Steel Plant : 30 నెలల్లోపు స్టీల్‌ప్లాంట్‌ తొలి దశ పూర్తి - సీఎం జగన్

Feb 15, 2023, 10:44 PM IST HT Telugu Desk
Feb 15, 2023, 10:44 PM , IST

  • CM Jagan lays foundation stone for JSW steel plant in kadapa: ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో జిందాల్ స్టీల్స్ కడపలో నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జిందాల్ ఎండి సజ్జన్ జిందాల్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్… ఇక్కడ నిర్మించబోయే స్టీల్‌ప్లాంట్‌ ప్రాజెక్టు మరో 24–30 నెలల్లోపు ప్రారంభమవుతుందన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీ అని చెప్పారు.

(1 / 5)

స్టీల్‌ప్లాంట్‌ ప్రాజెక్టు మరో 24–30 నెలల్లోపు ప్రారంభమవుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్. 3 మిలియన్‌ టన్నుల ప్లాంటును  రెండు దశలలో కట్టడానికి జిందాల్‌ కార్యాచరణ తయారు చేశారని.... ఇందులో మొదటి దశ మరో 24 నుంచి 30 నెలల్లో పూర్తవుతుందని చెప్పారు. ఇది రూ.3,300 కోట్లతో పూర్తవుతుందని పేర్కొన్నారు.

(2 / 5)

సెకండ్‌ ఫేజ్‌ మరో 5 సంవత్సరాలలో రూ.5,500  కోట్లతోనూ కలిపి మొత్తంగా రెండు దశల్లోనూ రూ.8,800 కోట్లతో ఈ ప్రాంతంలో 3మిలియన్‌ టన్నుల సామర్ధ్యమున్న స్టీల్‌ ప్లాంట్‌ ఈ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు ముఖ్యమంత్రి జగన్. బళ్లారిలో కూడా జిందాల్‌ గ్రూపు స్టీల్‌ ప్లాంట్‌ మొదలుపెట్టినప్పుడు 3 మిలియన్‌ టన్నుల సామర్ధ్యం అనే చెప్పావరని... ఇవాళ అది పెరుగుతూ వస్తూ... 13 మిలియన్‌ టన్నుల ప్లాంట్‌ అవడంతో ఆ ప్రాంత రూపురేఖలు అన్ని పూర్తిగా మారాయని గుర్తు చేశారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు.

(3 / 5)

జిందాల్‌ స్టీల్‌ ఫ్యాక్టరీతోపాటు పక్కన అనుబంధ పరిశ్రమలు కూడా వ్యవస్ధ ఏర్పడుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్. ఫలితంగా ఇక్కడో స్టీల్‌ సిటీ ఆవిర్భావమవుతుందన్న ఉద్దేశ్యంతో గొప్ప అడుగులు వేస్తున్నామన్నారు. ఈ ప్లాంట్‌కు సంబంధించి 67వ నెంబరు జాతీయ రహదారిని కలుపుతూ.. ఏడున్నర కిలోమీటర్ల మేరకు నాలుగు లైన్ల రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట రైల్వే లైను కొరకు కొత్తగా మరో పదికిలోమీటర్లు లైన్‌ నిర్మాణం కూడా జరుగుతుందని.... గండికోట రిజర్వాయర్‌ నుంచి 2 టీఎంసీల నీటిసరఫరా కోసం ప్రత్యేక పైపులైన్‌ ద్వారా అందించే కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు.

(4 / 5)

గడిచిన మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్. 2019 నుంచి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రాలకు ర్యాంకింగ్‌ ఇచ్చే ముందు పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పరిశ్రమలకు ఎంత అనుకూలంగా ఉందని చెప్పుకొచ్చారు.  

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు