BC Census In AP: ఏపీలో బీసీ కులగణనపై అధ్యాయనం చేస్తామన్న మంత్రి-chief minister s decision to form a committee for study to undertake caste census in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bc Census In Ap: ఏపీలో బీసీ కులగణనపై అధ్యాయనం చేస్తామన్న మంత్రి

BC Census In AP: ఏపీలో బీసీ కులగణనపై అధ్యాయనం చేస్తామన్న మంత్రి

HT Telugu Desk HT Telugu
Apr 11, 2023 06:54 PM IST

BC Census In AP: ఆంధ‌్రప్రదేశ్‌లో బిసి కుల గణన చేయడానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెల్లుబోయిన ప్రకటించారు. మిగిలిన రాష్ట్రాల కంటే ముందే ఏపీలో బీసీ కుల గణన చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి ఫూలే జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రకటించారు.

బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు
బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు

BC Census In AP: ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కుల గణనపై అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణు ప్రకటించారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకంటే ముందుగానే ఏపీలో కుల గణన చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి ప్రకటించారు.

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శాలు ఆచరణీయమని చెప్పారు.

ఫూలే అడుగు జాడల్లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నడుస్తున్నారని, పూలే వారసుడిగా నిలిచారన్నారు. రాష్ట్రంలోని 139 బీసీ కులాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడం కోసం బీసీ గణన చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మంత్రి వేణు చెప్పారు. దీని కోసం కులగణన చేపడుతున్న ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి అధ్యయనం చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, పూలే జయంతి సందర్భంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు మంత్రి వేణు చెప్పారు. దేశంలోనే అందరి కంటే ముందుగా మన రాష్ట్రంలోనే కులగణన చేపట్టాలని సిఎం గారు ఆదేశించినట్లు మంత్రి వేణు వివరించారు.

మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రి భాయ్‌ పూలేలు బీసీల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. వారి ఆశయాలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్న రాష్ట్రం శ్రీ జగన్‌ గారి నాయకత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో 25 మంది మంత్రులుంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారేనని, దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి సామాజిక న్యాయం చేయలేదన్నారు మనల్ని చూసి మిగిలిన రాష్ట్రాలు కూడా బీసీల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేస్తున్నాయన్నారు. బీసీలకు ఏ ఒక్క మేలూ చేయని చంద్రబాబు కూడా బీసీలపై చర్చకు సిద్ధమా అంటున్నాడు. బీసీలంతా గళమెత్తి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యమని జోగి రమేష్‌ స్పష్టం చేశారు.

 

IPL_Entry_Point