CBN Bail Petition: “నాట్ బిఫోర్ మీ”తో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
CBN Bail Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. వెకేషన్ బెంచ్ ముందు విచారణ నుంచి జస్టిస్ జ్యోతిర్మయి తప్పుకున్నారు. బెయిల్‌పై ఏ బెంచ్ విచారించాలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారన్నారు.
CBN Bail Petition: కంటి శస్త్ర చికిత్స కోసం చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు హైకోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. బాబు పిటిషన్ వేరే బెంచ్ విచారిస్తుందంటూ నాట్ బిఫోర్ మీ అని పేర్కొన్నారు. బాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ముందుంచాలని రిజిస్ట్రీని జస్టిస్ జ్యోతిర్మయి ఆదేశించారు. దీంతో ఈ నెల 30వ తేదీకి చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది.గురువారం హౌజ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు వెకేషన్ బెంచ్ తిరస్కరించడంతో శుక్రవారం విచారణకు వచ్చింది. శుక్రవారం నాట్ బిఫోర్ మీ అని న్యాయమూర్తి ప్రకటించడంతో విచారణ వాయిదా పడింది.
బాబు బెయిల్ పిటిషన్ విచారణ హైకోర్టు సీజే సోమవారం విచారిస్తారని వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ప్రకటించారు. సోమవారం కాకుండా వెంటనే విచారించే విధంగా తాము విజ్ఞప్తి చేసుకుంటామని చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసును న్యాయమూర్తి బదిలీ చేశారు. ఏ కోర్టు విచారించాల్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకుంటారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో కేసు విచారణ 30వ తేదీకి వాయిదా పడింది. తలిల