CBN Challenge: జగన్‌ సభలపై చంద్రబాబు ఆగ్రహం… అభివృద్ధి, విధ్వంసాలపై బహిరంగ చర్చకు రావాలని సవాలు...-chandrababus anger against jagan challenge to come to public discussion on development ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Challenge: జగన్‌ సభలపై చంద్రబాబు ఆగ్రహం… అభివృద్ధి, విధ్వంసాలపై బహిరంగ చర్చకు రావాలని సవాలు...

CBN Challenge: జగన్‌ సభలపై చంద్రబాబు ఆగ్రహం… అభివృద్ధి, విధ్వంసాలపై బహిరంగ చర్చకు రావాలని సవాలు...

Sarath chandra.B HT Telugu
Feb 19, 2024 08:21 AM IST

CBN Challenge: ఏపీలో అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జగన్‌తో చర్చించడానికి తాను సిద్ధమని, బూటకపు ప్రసంగాలు కాకుండా బహిరంగ చర్చకు రావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సవాలు చేశారు.

జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం
జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం

CBN Challenge: బూటకపు ప్రసంగాలు కాకుండా...దమ్ముంటే బహిరంగ చర్చకు జగన్ సిద్దమా? అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సవాలు చేశారు. ఎవరి పాలన స్వర్ణయుగమో...ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దాం? చర్చకు వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు.

సిద్దం అని సభలు పెట్టి...అశుద్దం మాటలు చెపుతున్నాడని, 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క చాన్సే జగన్ కు రాజకీయంగా చివరి చాన్స్ అవుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచెయ్యడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారన్నారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ఆరాచక, విధ్వంస పాలనపై సీఎంతో చర్చకు తాను సిద్ధం అని టీడీపీTDP అధినేత నారా చంద్రబాబు CBN నాయుడు అన్నారు. వందల కోట్లు ఖర్చు చేస్తూ....అధికార దుర్వినియోగంతో సిద్ధం అని సభలు పెడుతూ జగన్ Jagan చెబుతున్న అసత్యాల నిగ్గుతేల్చేందుకు తాను సిద్ధం Siddham అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు కాదు...దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు జగన్ సిద్దమా? ఏ అంశం మీదైనా..ఎక్కడైనా, ఏ రోజైనా చర్చకు నేను సిద్దమే అని చంద్రబాబు అన్నారు. ఎవరి పాలన స్వర్ణయుగమో...ఎవరి పాలన రాతియుగమో చర్చిద్ధాం..చర్చకు వచ్చే దమ్ముందా జగన్ అంటూ సవాల్ చేశారు.

ప్రజలకుే రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్ సంక్షేమ గురించి చెప్పడమా? సహజ వనరుల దోపిడీతో, స్కాం కోసమే స్కీం పెట్టిన విధానాలతో అత్యంత ధనిక ముఖ్యమంత్రి గా మారిన జగన్....పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో జగన్ పాలనలో ఏ మూలన చూసినా అభివృద్దిDevelopment కాదు...ఏ ఊరుకెళ్లినా జగన్ 5 ఏళ్ల విధ్వంసం పాలనతో నష్టపోయిన ప్రజలు కనిపిస్తున్నారని చంద్రబాబు అన్నారు. సిద్ధం అని సభలు పెడుతూ జగన్ నోటి వెంట అశుద్ధ పలుకులు పలికాడని చంద్రబాబు తీవ్రంగా మండి పడ్డారు.

ఓటమి భయంతో 77 మంది ఎమ్మెల్యేలను బదిలీలు అంటూ జగన్ ఇప్పటికే మడతపెట్టాడని...మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలను మోసం చేసి...సామాజిక ద్రోహం చేసిన జగన్..సామాజిక న్యాయం అనే పదం పలికే అర్హతే లేదని అన్నారు. జగన్ చెప్పినట్లు రేపు ఎన్నికల్లో ప్రతి బాధిత కుటుంబం వైసీపీని ఓడించేందుకు స్టార్ క్యాంపెయినర్ కాబోతోందని అన్నారు.

వచ్చే ఎన్నికలు నిజమైన పెత్తందారు జగన్ కు 5 కోట్ల ప్రజలకు మధ్య యుద్ధం అని అన్నారు. టీడీపీ తెచ్చిన 120 సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి జనం కసితో ఉన్నారని అన్నారు. ఎస్.సి., ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్ల రూపాయలు దారి మళ్లించిన జగన్ పై పేదలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

మ్యానిఫెస్టోManifestoలో మద్య నిషేధం అని చెప్పి...తరువాత దాన్ని మద్య నియంత్రణ అని మార్చి..రూ.1.50లక్షల కోట్ల మద్యం అమ్మిన జగన్ విశ్వసనీయత గురించి చెపితే జనం నమ్మాలా అని ప్రశ్నిచారు. 98 శాతం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు అని జగన్ చెపుతున్న మాటలు పూర్తిగా బూకటం అని....ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాధుడుతో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపడం నిజం అని అన్నారు.

Whats_app_banner