TTD Mobile Application : ఇక యాప్‌లోనే టీటీడీ టిక్కెట్ల బుకింగ్….-chairman subba reddy released new mobile application of ttd for devotees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Mobile Application : ఇక యాప్‌లోనే టీటీడీ టిక్కెట్ల బుకింగ్….

TTD Mobile Application : ఇక యాప్‌లోనే టీటీడీ టిక్కెట్ల బుకింగ్….

HT Telugu Desk HT Telugu
Jan 27, 2023 01:33 PM IST

TTD Mobile Application తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టిక్కెట్లతో పాటు వివిధ రకాల సేవా టిక్కెట్ల కొనుగోలులో భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి టీటీడీ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి యాప్‌ను విడుదల చేశారు.

టీటీడీ రూపొందించిన యాప్ విడుదల చేస్తున్న ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి
టీటీడీ రూపొందించిన యాప్ విడుదల చేస్తున్న ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి

TTD Mobile Application టీటీడీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో లభించే దర్శన టికెట్లు, సేవాటికెట్ల బుకింగ్‌ తో పాటు టీటీడీకి సంబంధించిన సమస్త సమాచారం నిక్షిప్తం చేసిన మొబైల్ అప్లికేషన్‌ను ఛైర్మన్‌ సుబ్బారెడ్డి విడుదల చేశారు.

yearly horoscope entry point

భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటిడి దేవస్థానం పేరుతో రూపొందించిన మొబైల్‌ యాప్‌ను వైవి.సుబ్బారెడ్డి తిరుమల అన్నమయ్య భవనంలో ప్రారంభించారు.

భక్తుల కోసం ఇప్పటివరకు గోవింద మొబైల్‌ యాప్‌ ఉండేదని, దీన్ని మరింత ఆధునీకరించి నూతన యాప్‌ను రూపొందించామని తెలిపారు. మొబైల్‌ యాప్‌ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవచ్చన్నారు. విరాళాలు కూడా ఇదే యాప్‌ నుండి అందించవచ్చన్నారు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని, ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా ఈ యాప్‌ ద్వారా చూడవచ్చన్నారు.

తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్‌లో ఉందని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. జియో సంస్థ సహకారంతో టిటిడి ఐటి విభాగం ఈ యాప్‌ను రూపొందించినట్టు వివరించారు. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్‌ ద్వారా క్లౌడ్‌ టెక్నాలజిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్‌ చేసుకోగలుగుతున్నారని వివరించారు. నూతన యాప్‌ సేవలపై భక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించి అవసరమైతే మరిన్ని పొందుపరుస్తామని చెప్పారు.

భక్తులకు డిజిటల్‌ గేట్‌ వే ఈవో ఎవి.ధర్మారెడ్డి

భక్తులకు సంబంధించిన అన్ని అవసరాల కోసం డిజిటల్‌ గేట్‌ వేగా ఈ యాప్‌ ఉపయోగపడుతుందని టిటిడి ఈవో ధర్మారెడ్డి అన్నారు. భక్తులు లాగిన్‌ అయ్యేందుకు యూజర్‌ నేమ్‌తోపాటు ఓటిపి ఎంటర్‌ చేస్తే చాలని, పాస్‌వర్డ్‌ అవసరం లేదని చెప్పారు. కంప్యూటర్‌ వాడడం తెలియనివారు కూడా వినియోగించేందుకు వీలుగా ప్రపంచస్థాయి యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు.

Whats_app_banner