BRS Protsests: బేషరతుగా రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో ఆగస్టు 22న ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు-brs calls for protests in on august 22 demanding unconditional loan waivers for all farmers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Brs Protsests: బేషరతుగా రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో ఆగస్టు 22న ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు

BRS Protsests: బేషరతుగా రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో ఆగస్టు 22న ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు

Sarath chandra.B HT Telugu
Aug 21, 2024 07:46 AM IST

BRS Protsests: రాష్ట్రంలోని రైతులందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 22న అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రైతు రుణమాఫీ హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

రుణమాఫీపై ఆందోళనలకు బీఆర్‌ఎస్‌ పిలుపు
రుణమాఫీపై ఆందోళనలకు బీఆర్‌ఎస్‌ పిలుపు

BRS Protsests: రాష్ట్రంలోని రైతులందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.

ప్రతి ఒక్కరికీ రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేశామని ముఖ్యమంత్రి చెబుతుంటే, రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని మంత్రులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పథకం వల్ల ప్రయోజనం పొందకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవసరమవుతాయని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ప్రస్తావించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు గుర్తించారు. రైతులందరికీ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

సరైన రుణమాఫీ జరగలేదని ఆందోళన చేస్తున్న రైతులను ఆదుకోవాల్సింది పోయి మంత్రులు, కాంగ్రెస్ నేతలు గందరగోళాన్ని పెంచే ప్రకటనలు చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై కేటీఆర్ మండిపడ్డారు.

రుణమాఫీ వల్ల 40 శాతం మంది రైతులకు కూడా ప్రయోజనం కలగలేదని క్షేత్రస్థాయిలో సమాచారం ఉందన్నారు. "కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కారణంగా, లక్షలాది మంది రైతులు పదేపదే ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించవలసి వస్తోంది" అని బిఆర్ఎస్ నాయకుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

బేషరతుగా రుణమాఫీ చేసే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రుణమాఫీపై విధించిన అనేక ఆంక్షలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 22న అన్ని మండలాల్లో రైతుల తరపున పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

Whats_app_banner