AP BJP On Budget 2023: అంకెల గారడీగా ఏపీ బడ్జెట్ - సోము వీర్రాజు
BJP ap president Somu Veerraju: ఏపీ బడ్జెట్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సెటైర్లు విసిరారు. అప్పులను ఆదాయంగా చూపించకూడదని ఆర్బీఐ చేసిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకోలేదన్నారు. అసెంభ్లీ సాక్షిగా ఆర్ధిక మంత్రి బుగ్గన అంకెల గారిడీతో మాయ చేశారని దుయ్యబట్టారు.
BJP ap president Somu Veerraju On Budget 2023: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను అంకెల గారడీగా అభివర్ణించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అసెంభ్లీ సాక్షిగా ఆర్ధిక మంత్రి బుగ్గన అంకెల గారిడీతో మాయ చేశారని దుయ్యబట్టారు. విదేశీ ప్రముఖల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బడ్జెట్ కు తన వాదనలను సమర్ధించుకుంటూ రాష్ట్రప్రజలకు అవాస్తవాలను చెప్పారని అన్నారు. ఆర్ధిక మంత్రి వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర నిధులు, పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనంగా శాశనసభలో ఎలా చెబుతారని సోము ప్రశ్నించారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకునే రుణాలు ఎంత అనేది వెల్లడించాలని డిమాండ్ చేశారు. కనీసం కాగ్ కు కూడా నివేదిస్తున్నారో లేదో తెలియని గందరగోళం ప్రభుత్వంలో కొట్టొచ్చినట్లు కనపడుతోందన్నారు.
ఒక స్టిక్కర్ బడ్జెట్ గా అభివర్ణించారు సోమువీర్రాజు. రాష్ట్ర బడ్జెట్ 80 శాతం రెవెన్యూ వ్యయం కాగా మూలధనం వ్యయం పెరగకపోవడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నారు. మూలధనం వ్యయం లేకపోతే ఆర్ధిక కార్యకలాపాలు జరగాక దీర్ఘకాలిక అభివ్రుద్ది లక్ష్యాలు కుంటుపడతాయన్నారు. ద్రవ్యలోటు పెరిగిపోవడంతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రతినెల సుమారుగా 21వేల కోట్లు రాష్ట్రానికి అవసరం ఉండగా సుమారు 10 వేల కోట్లు ఆదాయంగా వస్తున్నా ప్రతి నెల నాలుగువేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు చెబుతున్నారని పేర్కొన్నారు. మిగిలిన ఏడు వేలకోట్లు ఏవిధంగా సమకూరుతున్నాయన్న విషయం ప్రభుత్వం వెల్లడించడం లేదని.. ఫలితంగా ప్రభుత్వ ఆర్థిక తీరుతెన్నులపై మిలియన్ డాలర్ల అనుమానం కలుగుతోందని దుయ్యబట్టారు. కార్పొరేషన్ల పై తీసుకున్నరుణాలకు సంబందించిన విషయాలను ఆర్ధిక మంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మద్య, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఒక అంకెలగారడీగానే కనపడుతోందన్నారు సోము. ఉత్తరాంద్ర, రాయలసీమల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నేటికీ సమస్యల సుడిగుండంలోనే ఉండడమే ఇందుతార్కాణమన్నారు. విద్యారంగానికి సంబంధించిన విషయంలో కేంద్రం ఇస్తున్న సహకారం మాత్రమే కనపడుతోందని... అయితే బడ్జెట్ లో రాష్ట్రం చేస్తున్నట్లుగా ఎలా చూపించుకుంటారని ప్రశ్నించారు. ఇళ్లు నిర్మాణానికి సంబందించి ఆర్ధిక మంత్రి అంతా రాష్ట్రం చేస్తున్నట్లు చెప్పుకోవడం చూస్తే జాలి వేస్తోందన్నారు. కేంద్రం ఇచ్చిన ఇళ్లు సకాలంలో నిర్మాణం చేయకుండా అబద్దాలతో ఇళ్లు కడుతోందని రాష్ట్ర ప్రభుత్వం పై సోమువీర్రాజు మండిపడ్డారు.
సంబంధిత కథనం