APSRTC : తిరుపతి -కాణిపాకం మధ్య ఇంద్ర ఏసీ బస్ సర్వీసులు
APSRTC Latest Updates : ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త సేవలను తీసుకొచ్చింది.తిరుపతి-కాణిపాకం మధ్య ఇంద్ర ఏసీ బస్ సర్వీసులు నడవనున్నాయి.
APSRTC Latest Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) పుణ్యక్షేత్రాలకు బస్ సర్వీసులను వేసింది. రాష్ట్రంలోని తిరుపతి నుంచి కాణిపాకానికి ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్ సర్వీస్‌లను తీసుకొచ్చింది.
తిరుపతి నుంచి కాణిపాకానికి మధ్య వివిధ ప్రాంతాలు మీదుగా ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారికి మరింత సౌకర్యం కానునుంది. తిరుపతి-కాణిపాకం పుణ్యక్షేత్రాల మధ్య ఇంద్ర ఎసీ బస్సులతో ప్రయాణం మరింత సులభతరం, సుఖవంతం అవుతుందని ఆర్టీసీ తెలిపింది.
తిరుపతి నుంచి కాణిపాకానికి రెండు ఇంద్ర ఏసీ బస్ సర్వీస్‌లు ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి సర్వీస్ తిరుపతిలో ఉదయం 9.20 గంటలకు ఇంద్ర ఏసీ బస్ సర్వీస్ ప్రారంభమై, ఉదయం 10.50 గంటలకు కాణిపాకం చేరుకుంటుంది. రెండో సర్వీస్ తిరుపతిలో ఉదయం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై కాణిపాకాని సాయంత్రం 6.10 గంటలకు చేరుకుంటుంది.
ప్రతిరోజు సూపర్ లగ్జరీ బస్సు తిరుపతిలో రాత్రి 9.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోరు ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. అలాగే అదే రోజు హైదరాబాద్‌లో రాత్రి 7.30 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు కాణిపాకం చేరుకుంటుంది.
అక్కడ నుంచి తిరుపతి వెళ్తుంది. హైదరాబాద్-కాణిపాకం మధ్య టిక్కెట్ ధర పెద్దలకు రూ.1,121, పిల్లలకు రూ.622 ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్ సర్వీస్ టిక్కెట్టును https://www.apsrtconline.inలో బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.