APSRTC Recruitment : ఏపీఎస్ఆర్టీసీలో 7545 ఉద్యోగ ఖాళీలు, పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధం
APSRTC Recruitment : ఏపీఎస్ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆర్టీసీలోని 18 కేటగిరీల్లో 7545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. త్వరలో ఆర్టీసీ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రానుంది.
ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్‌టీసీ)లో భారీగా ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఏకంగా 7,545 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న ఖాళీలపై పూర్తిగా వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. 18 కేటగిరిల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఈ నియామక ప్రక్రియ ప్రారంభమైతే భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి.
కేటగిరీల వారీగా పోస్టులు ఖాళీలు
డ్రైవర్ పోస్టులు 3,673, కండక్టర్ పోస్టులు 1,813, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 656, అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ పోస్టులు 579, ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు 207, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు 179, డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు 280 ఖాళీగా ఉన్నాయి. ఇందులో డ్రైవర్, కండక్టర్ పోస్టులు భర్తీ నిత్య సేవలను మెరుగుపరుస్తాయి. ఈ నియామకాల్లో అసిస్టెంట్ మెకానికల్‌లు, శ్రామిక్‌లు వెహికల్స్ సరిగ్గా పనిచేయడానికి అవసరమైన సిబ్బంది. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీలు, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీలు మేనేజ్‌మెంట్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తారు. డిప్యూటీ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు వారు ఆఫీసు పనులను నిర్వహిస్తారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే విద్యార్హత తప్పని సరిగా ఉండాలి. డ్రైవర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కండక్టర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు పదో తరగతి, ఐటీఐ చేసి ఉండాలి. అసిస్టెంట్ మెకానిక్ డిగ్రీ, ట్రాఫిక్ సూపర్‌వైజర్ పోస్టులకు బీటెక్, మెకానిక్ సూపర్‌వైజర్ పోస్టులకు బీటెక్, డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే కనీసం 18 ఏళ్ల గరిష్టంగా 42 ఏళ్లు ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సు సడలింపు కూడా ఉంటుంది. నెలవారీ జీతం ఎంపిక అయిన పోస్టులను బట్టీ ఉంటుంది. రూ.18,500 నుంచి రూ.35,000 వరకు జీతం వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చిన ప్రభుత్వ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ పోస్టులకు భర్తీ ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష నిర్వహిస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. మరికొన్ని రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
అయితే మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతలు కల్పించలేదు. ఇటీవలి కొంత మంది అధికారుల, ఉద్యోగులకు పదోన్నతలు కల్పించారు. ఈ పదోన్నతలతో 600 నుంచి 800 మంది అధికారులు, ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం జరుగుతుంది. అయితే దాదాపు ఎనిమిది వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతలకు సంబంధించిన పదోన్నతల ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నేత ఒకరు తెలిపారు. ఆర్టీసీలో పదోన్నతలు పూర్తి అయిన తరువాత కొత్త ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ తరువాత ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం