AP Govt Jobs : ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు - పోస్టుల వివరాలివే-applications are invited for filling 56 posts government hospitals of anantapur district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Jobs : ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు - పోస్టుల వివరాలివే

AP Govt Jobs : ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు - పోస్టుల వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 19, 2023 03:13 PM IST

AP Health Department Jobs 2023: పలు జిల్లాలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది ఏపీ కుటుంబ, వైద్యారోగ్యశాఖ. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో 56 ఉద్యోగాలు, కృష్ణా జిల్లాలో 52 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాలు
వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాలు

AP Health Department Jobs 2023: పలు జిల్లాలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ కుటుంబ, వైద్యారోగ్యశాఖ నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిని కాంట్రాక్ట్/ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ముఖ్య వివరాలను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

yearly horoscope entry point

అనంతపురం జిల్లా:

మొత్తం పోస్టులు - 56

పోస్టుల వివరాలు

1. ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌ 2- 2

2. ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌ 2- 2

3. రేడియోగ్రాఫర్‌- 1

4. థియేటర్‌ అసిస్టెంట్‌- 8

5. ల్యాబ్‌ అటెండెంట్‌- 2

6. పోస్ట్‌మార్టం అసిస్టెంట్‌- 3

7. మెడికల్‌ రికార్డ్‌ అసిస్టెంట్‌/ రికార్డ్‌ అసిస్టెంట్‌- 2

8. జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌ జీడీఏ/ ఎంఎన్‌వో/ ఎఫ్‌ఎన్‌వో- 28

9. ఆఫీస్‌ సబార్డినేట్‌- 1

10. ప్లంబర్‌- 5

11. ఎలక్ట్రీషియన్‌- 1

12. ఆడియోమెట్రీషియన్‌/ ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌- 1

అర్హతలు - పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్‌టీ, నర్సింగ్‌ ఆర్డర్లీ కోర్సు, డిప్లొమా.

ఉద్యోగాలకు ఎంపిక - అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా.

జీతం - ఆయా పోస్టులను అనుసరించి 15 వేల నుంచి 32 వేల వరకు ఇస్తారు.

దరఖాస్తు - ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను అనంతపురంలోని హాస్పిటల్‌ సర్వీసెస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో అందజేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ - 21 అక్టోబరు 2023.

మెరిట్ లిస్ట్ - 28 డిసెంబర్, 2023

అధికారిక వెబ్‌సైట్‌ - https://ananthapuramu.ap.gov.in

కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు :

కృష్ణా జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వాసుపత్రుల్లో 52 పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇందులో స్టాఫ్‌ నర్స్‌ - 24, మెడికల్‌ ఆఫీసర్‌- 10, మల్టీ రిహాబిలిటేషన్‌ వర్కర్‌ - 8, ఎల్‌జీఎస్‌ - 4, సపోర్టింగ్‌ స్టాఫ్‌ - 3, ఫిజియోథెరపిస్ట్‌ - 2, సెక్యూరిటీ గార్డ్‌- 1 ఉద్యోగాలు ఉన్నాయి.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, పరాసుపేట, నాయర్‌బడ్డి సెంటర్‌, మచిలీపట్నం, కృష్ణా జిల్లా’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 20.అక్టోబరు 2023.

అధికారిక వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in

Whats_app_banner