AP TET Keys 2024 : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్.... వెబ్ సైట్ లో మరికొన్ని ప్రిలిమినరీ కీలు - ఫైనల్ 'కీ' ఎప్పుడంటే..?-ap tet 2024 answer keys for october 15 to 18 exams released at aptetapcfssin ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet Keys 2024 : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్.... వెబ్ సైట్ లో మరికొన్ని ప్రిలిమినరీ కీలు - ఫైనల్ 'కీ' ఎప్పుడంటే..?

AP TET Keys 2024 : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్.... వెబ్ సైట్ లో మరికొన్ని ప్రిలిమినరీ కీలు - ఫైనల్ 'కీ' ఎప్పుడంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 20, 2024 10:10 AM IST

AP TET Key Results 2024 : ఏపీ టెట్ అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. అక్టోబర్‌ 3 నుంచి 18వ తేదీ వరకు జరిగిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ 'కీ' లు అందుబాటులోకి వచ్చాయి. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో https://aptet.apcfss.in/ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ టెట్ 2024
ఏపీ టెట్ 2024

ఏపీ టెట్ పరీక్షలు ఇవాళ్టితో ముగియనున్నాయి. నవంబర్ 2వ తేదీన విద్యాశాఖ తుది ఫలితాలను ప్రకటించనుంది. ఇదిలా ఉంటే… ఇప్పటివరకు పరీక్షలు రాసిన అభ్యర్థులకు విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. వెబ్ సైట్ లో మరికొన్ని సబ్జెక్టుల ప్రాథమిక కీలతో పాటు ప్రశ్నపత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అక్టోబర్‌ 3 నుంచి 18వ తేదీ వరకు జరిగిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ 'కీ' లు వెబ్ సైట్ లో ఉంచారు. పరీక్షలు రాసిన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

పేపర్‌ 1ఏ, 1బీ పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’లపై అభ్యంతరాలను అక్టోబర్‌ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాలని విద్యాశాఖ తెలిపింది. మిగిలిన పరీక్షల ప్రశ్నపత్రాలు, ‘కీ’లు పరీక్ష జరిగిన తర్వాతి రోజుల్లో విడుదల కానున్నాయి.

టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. రోజుకు రెండు సెషన్లలో ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టెట్ పరీక్షలు జరుగుతున్నాయి.

టెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ 27న టెట్ తుది ‘కీ’ విడుదల చేయనున్నారు. నవంబర్‌ 2న టెట్ ఫలితాల ప్రకటన ఉంటుంది.

ఏపీ టెట్ కీలను ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

Step 1 : అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.

Step 2: హోం పేజీలోని 'Question Papers & Keys' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

Step 3: మీ పరీక్ష తేదీ అనుగుణంగా ప్రాథమిక కీ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.

Step 4: టెట్ ఎగ్జామ్ పేపర్, ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్‌లోడ్ చేయండి.

Step 5 : భవిష్యత్ అవసరాల కోసం ఆన్సర్ కీ హార్డ్ కాపీని తీసుకోండి.

మరోవైపు నవంబర్ 3న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. మొత్తం 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దీనిపై విద్యాశాఖ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం