తెలుగు న్యూస్ / ఫోటో /
AP TET Results 2024 : నవంబర్ 2న ఏపీ టెట్ ఫలితాలు - ఆ వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్...!
- AP TET Results 2024 : ఏపీ టెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 21వ తేదీతో ముగుస్తాయి. ఇప్పటికే పూర్తైన పరీక్షల క్వశ్చన్ పేపర్లు, 'కీ'లు అందుబాటులోకి వచ్చాయి. తుది ఫలితాలను నవంబర్ 2వ తేదీన వెల్లడించనున్నారు. ఆ వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
- AP TET Results 2024 : ఏపీ టెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 21వ తేదీతో ముగుస్తాయి. ఇప్పటికే పూర్తైన పరీక్షల క్వశ్చన్ పేపర్లు, 'కీ'లు అందుబాటులోకి వచ్చాయి. తుది ఫలితాలను నవంబర్ 2వ తేదీన వెల్లడించనున్నారు. ఆ వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
(1 / 6)
ఏపీ టెట్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పరీక్షల ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరిస్తున్నారు.
(2 / 6)
అక్టోబర్ 21వ తేదీతో అన్ని పేపర్ల పరీక్షలు పూర్తి అయిపోతాయి. అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ కీలను ప్రకటిస్తారు.
(3 / 6)
అక్టోబర్ 27న టెట్ తుది ‘కీ’ విడుదల చేస్తారు. ఇక ఏపీ టెట్ తుది ఫలితాలను నవంబర్ 2వ తేదీన ప్రకటించనుంది విద్యాశాఖ. ఆ దిశగా కసరత్తు షురూ చేసింది.
(4 / 6)
జులై సెషన్ ఏపీ టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. రోజుకు రెండు సెషన్లలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టెట్ పరీక్షలు జరుగుతున్నాయి.
(5 / 6)
ఏపీ టెట్ కీ, ప్రశ్నపత్రాలను https://aptet.apcfss.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తుది ఫలితాలను కూడా ఇదే వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
(6 / 6)
మరోవైపు ఏపీలో మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 3న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 16,347 టీచర్ పోస్టులకు నవంబర్ 3వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. టెట్ ఫలితాల తర్వాత అధికారికంగా ప్రకటన విడుదల కానుంది. (image source https://unsplash.com/)
ఇతర గ్యాలరీలు