AP High Court | గెడ్డం శ్రీనుది హత్యా, ఆత్మహత్యా.. ఆరు నెలల తర్వాత రీ పోస్టుమార్టానికి హైకోర్టు ఆదేశం-ap high court orders for re postmortem in geddam srinu murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap High Court | గెడ్డం శ్రీనుది హత్యా, ఆత్మహత్యా.. ఆరు నెలల తర్వాత రీ పోస్టుమార్టానికి హైకోర్టు ఆదేశం

AP High Court | గెడ్డం శ్రీనుది హత్యా, ఆత్మహత్యా.. ఆరు నెలల తర్వాత రీ పోస్టుమార్టానికి హైకోర్టు ఆదేశం

HT Telugu Desk HT Telugu
Mar 23, 2022 03:23 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా మలకపల్లికి చెందిన గెడ్డం శ్రీను కిందటి ఏడాది అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. అయితే తమ కుమారుడిది ఆత్మహత్య కాదు.. హత్యేనంటూ.. శ్రీను తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనికి సంబంధించి.. హైకోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు ఇచ్చింది.

<p>ఏపీ హైకోర్టు</p>
ఏపీ హైకోర్టు

పశ్చిమ గోదావరి జిల్లా మలకపల్లిలో సంచలనం సృష్టించిన గెడ్డం శ్రీను హత్య కేసుపై హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రీ పోస్టుమార్టం చేయాలంటూ.. హైకోర్టు తెలిపింది. హై కోర్ట్ ఆదేశాలు ఇచ్చినా రాజకీయ కారణాలతో విచారణ నిష్పక్షపాతంగా జరగలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ చెప్పారు. 30 రోజుల్లోపు విచారణ పూర్తి చేసి పూర్తిస్థాయిలో రిపోర్ట్ ఫైల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ పోలీసులు రాజకీయ ప్రయోజనాలతో కేసులు నీరుగారుస్తున్నారాని కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ఆత్మహత్య అంటూ కేసు మూసివేస్తున్నరని వాదనలు వినిపించారు.

తన కుమారుడు గెడ్డం శ్రీనుది ముమ్మాటికీ హత్య అంటూ హై కోర్టులో మృతుడి తండ్రి బుల్లయ్య కేసు దాఖలు చేశారు. పలు సెక్షన్లతో 7 గురి మీద ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు హత్య కేసు నమోదు చేశారని.. కానీ వారిని అరెస్టు చేయలేదని.. శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలు విన్న ధర్మాసనం.. మృతుడు ఎలా చనిపోయాడు అనే దానికి సరైన ఆధారాలు లేవని.. అభిప్రాయపడింది. నిష్ణాతులైన ఎయిమ్స్ డాక్టర్స్ పర్యవేక్షణలో పోస్టు మార్టం నిర్వహించాలని ఆదేశించింది. నీస్పక్షపాతంగా విచారణ చేయాలంటూ డీజీపీకి చెప్పింది.

అసలేం జరిగిందంటే..?

పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని మలకపల్లి అరుంధతి పేటలో గెడ్డం బుల్లయ్య, వెంకాయమ్మ దంపతులు. వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ.. బతుకుతున్నారు. వారికి ఒకడే కుమారుడు. పేరు గెడ్డం శ్రీను. వెరేవారికి పాలేరుగా పని చేస్తున్నారు. ఆ పొలంలోనే నగ్నంగా పడి మృతి చెందాడు. అయితే అనుమానస్పద స్థితిలో మృతి చెందడంతో అందరికీ అనుమానం వచ్చింది. పోస్టు మార్టం నివేదికతో ఆత్మహత్యగా పోలీసులు అనుకున్నారు. అయితే శ్రీను తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడిది హత్యేనని చెబుతున్నారు. తమ కుమారుడిని చంపిన వారిని అరెస్టు చేసి న్యాయం చేయాలంటూ కొన్ని రోజులపాటు దీక్ష శిబిరాన్ని సైతం నిర్వహించి.. ఆందోళన చేశారు.

యజమానులే తమ కొడుకును హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఎందుకు చంపేశారో తెలియకుండానే..దూరం చేశారన్నారు. ఆ తర్వాత కేసు విచారణ.. ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయి అధికారికి బదిలీ అయింది. అయినా కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. అదే సమయంలో.. తమ కుమారుడిదే హత్యేనంటూ.. బాధితుడి తండ్రి.. హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తాజాగా రీ పోస్టు మార్టం చేయాలంటూ.. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Whats_app_banner