AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 150 ఉద్యోగాలు - నెలకు రూ. 70 వేల జీతం, అర్హతలివే-ap health department issued recruitment notification for tutors posts medical colleges ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 150 ఉద్యోగాలు - నెలకు రూ. 70 వేల జీతం, అర్హతలివే

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 150 ఉద్యోగాలు - నెలకు రూ. 70 వేల జీతం, అర్హతలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
May 04, 2024 11:08 AM IST

AP Medical Services Recruitment Board 2024: ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. కొత్త మెడికల్ కాలేజీల్లో ట్యూటర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది.

ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు
ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు

kAP Medical Services Recruitment Board Updates : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వివరాలను వెల్లడించింది. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

కొత్తగా ప్రారంభించిన అయిదు కళాశాలల్లో 158 ట్యూటర్ పోస్టుల(Tutors posts) భర్తీకి ఈ ప్రకటన జారీ అయింది. అర్హతల కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు మే 15వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://dme.ap.nic.in వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు.
  • ఉద్యోగాలు - ట్యూటర్ పోస్టులు
  • మొత్తం ఖాళీలు - 158
  • కొత్త మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో(కేవలం ఒక్క సంవత్సరానికి) వీటిని భర్తీ చేస్తారు.
  • అర్హతలు - దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
  • వేతనం - నెలకు రూ. 70,000.
  • ఎంపిక విధానం - వంద మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్ డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా 75 శాతం మార్కుల వరకు కేటాయిస్తారు. కాంట్రాక్ట్ సర్వీస్ చేసిన వారికి వెయిటేజీ ఉంటుంది.
  • వయసు - దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 47 ఏళ్ల లోపు ఉండాలి.
  • దరఖాస్తులు - ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులు ప్రారంభం - 4 మే 2024.
  • దరఖాస్తులకు తుది గడువు - 15 మే 2024.
  • దరఖాస్తు రుసుం - ఓసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
  • అధికారిక వెబ్ సైట్ - http://dme.ap.nic.in

కింద ఇచ్చిన PDFలో డిపార్ట్ మెంట్ల వారీగా ఖాళీల వివరాలు చూడొచ్చు….

IPL_Entry_Point