AP EAPCET 2023: EAPCET, ICET, ECET షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే-ap eapcet 2023 exam dates released check full details are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Eapcet 2023: Eapcet, Icet, Ecet షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే

AP EAPCET 2023: EAPCET, ICET, ECET షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే

HT Telugu Desk HT Telugu
Mar 08, 2023 09:51 PM IST

AP EAPCET 2023 Updates:ఏపీఈఏపీసెట్‌-2023 పరీక్ష తేదీలు వచ్చేశాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

ఏపీఈఏపీసెట్‌ పరీక్ష తేదీలు వెల్లడి
ఏపీఈఏపీసెట్‌ పరీక్ష తేదీలు వెల్లడి (eapcet-sche.aptonline.in/EAPCET/)

Andhra Pradesh Engineering, Agriculture and Pharmacy Common Entrance Test Exam Dates: ఏపీలో ఒక్కొక్క ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. తాజాగా ఏపీఈఏపీసెట్‌ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు రాత పరీక్షలను నిర్వహించనున్నారు. ఆయా తేదీలు, వివరాలు చూస్తే.....

మే 15 నుంచి 18 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈఏపీసెట్‌ దరఖాస్తుకు ఈనెల 11 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 15వ తేదీతో గడువు ముగియనుంది. మే 5వ తేదీన ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌) నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించి మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్
ఏపీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్

మే 24, 25న ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్ టెస్ట్‌ (ఐసెట్‌) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 19 వరకు గడువు ఉంటుంది.

ఏపీ ఈసెట్ 2023 పరీక్ష మే 5, 2023

ఏపీ ఈఏపీసెట్ 2023 స్ట్రీమ్ పరీక్ష మే 15 నుంచి 18, 2023

ఏపీ ఈఏపీసెట్ 2023 బైపీసీ స్ట్రీమ్ పరీక్ష మే 22 నుంచి 25, 2023

ఏపీ ఐసెట్ 2023 పరీక్ష మే 24 నుంచి 26, 2023

ఏపీ పీజీఈసెట్, ఏపీ లాసెట్. ఏపీ ఎడ్ సెట్, పీజీ‌సెట్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ రావాల్సి ఉంది. త్వరలోనే ఆయా తేదీలు విడుదల కానున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం