Pawan Kalyan On Vijay : హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై పవన్ కల్యాణ్ రియాక్షన్, ట్వీట్ వైరల్-ap dy cm pawan kalyan tweet on tvk party president hero vijay political entry tweet viral ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan On Vijay : హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై పవన్ కల్యాణ్ రియాక్షన్, ట్వీట్ వైరల్

Pawan Kalyan On Vijay : హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై పవన్ కల్యాణ్ రియాక్షన్, ట్వీట్ వైరల్

Bandaru Satyaprasad HT Telugu
Oct 28, 2024 05:10 PM IST

Pawan Kalyan On Vijay : కోలీవుడ్ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. నిన్న విజయ్ తన రాజకీయ పార్టీ తొలి సభ నిర్వహించారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై పవన్ కల్యాణ్ రియాక్షన్, ట్వీట్ వైరల్
హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై పవన్ కల్యాణ్ రియాక్షన్, ట్వీట్ వైరల్

కోలీవుడ్‌ హీరో విజయ్‌ రాజకీయాల్లో అడుగుపెట్టారు. తమిళిగ వెట్రి కళగం(Tamizhaga Vetri Kazhagam) రాజకీయ పార్టీని స్థాపించారు. తమిళనాడోలు ఆదివారం ఈ పార్టీ తొలి భారీ బహిరంగ సభ జరిగింది. హీరో విజయ్ (Vijay) పొలిటికల్‌ ఎంట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎక్స్ వేదికగా స్పందించారు. హీరో విజయ్ కు అభినందనలు తెలిపారు. ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన హీరో విజయ్‌కు తన హృదయపూర్వక అభినందనలు అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

తమిళ అగ్ర నటుడు ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విజయ్ పొలిటికల్ పార్టీ తొలి సభ ఆదివారం నిర్వహించారు. ఈ సభలో విజయ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తానన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే తమ పార్టీ భావజాలం అన్నారు. రాజకీయాల్లో గెలుపోటముల స్టోరీలు చదివాక... పీక్ స్టేజ్ లో తన సినీ కెరీర్‌ని వదిలేసి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

టీవీకే అగ్రనేత విజయ్ తమ తొలి రాజకీయ ప్రసంగంలో అధికార డీఎంకేపై విరుచుకుపడ్డారు. ఒక కుటుంబం రాష్ట్రాన్ని లూటీ చేస్తోందని విమర్శించారు. డీఎంకే అండర్‌ గ్రౌండ్ డీలింగ్ చేస్తుంది, మైనారిటీలను మోసం చేయడానికి ఫాసిజాన్ని ఆరోపిస్తుంది, ద్రవిడ మోడల్ పేరుతో ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. బీజేపీపై కూడా విజయ్ విమర్శలు చేశారు. ద్వేషపూరిత, విభజన రాజకీయాలకు తాము వ్యతిరేకం అన్నారు. తాము రాజకీయ మర్యాదను కొనసాగిస్తానన్నారు. ఇకపై వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదని విజయ్ అన్నారు.

లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే టీవీకే భావజాలం అని విజయ్ అన్నారు. పెరియార్‌ ఈవీ రామస్వామి, కామరాజ్‌, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, వేలు నాచియార్‌, అంజలి అమ్మాళ్‌ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. రాజకీయ అనుభవం లేదని విమర్శిస్తున్నారని, కానీ అమితమైన ఆత్మవిశ్వాసంతో రాజకీయ స్పరంతో ఆడుకునే పిల్లల్లాంటివాళ్లం అన్నారు.

బీజేపీ నిరంకుశత్వంతో వ్యవహరిస్తుందని విజయ్ విమర్శించారు. తన రాజకీయ ప్రయాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. నీట్‌ విద్యార్థిని ఆత్మహత్యను గుర్తు చేస్తూ నీట్‌పై టీవీకే వ్యతిరేక వైఖరిని విజయ్ ప్రకటించారు. పీక్ స్టేజీలో సినీ కెరీర్‌లో వదిలేసి ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా అవమానించారని గుర్తుచేశారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విమర్శలను ఎదుర్కొన్నారన్నారు. వారిద్దరూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించారని తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమావ్యక్తం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం