CM Jagan On Pawan : మళ్లీ పెళ్లి.. మళ్లీ వదిలేయడం, నువ్వా వాలంటీర్లను అనేది - పవన్ పై ధ్వజమెత్తిన సీఎం జగన్‌-ap cm ys jagan fires on pawan kalyan comments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan On Pawan : మళ్లీ పెళ్లి.. మళ్లీ వదిలేయడం, నువ్వా వాలంటీర్లను అనేది - పవన్ పై ధ్వజమెత్తిన సీఎం జగన్‌

CM Jagan On Pawan : మళ్లీ పెళ్లి.. మళ్లీ వదిలేయడం, నువ్వా వాలంటీర్లను అనేది - పవన్ పై ధ్వజమెత్తిన సీఎం జగన్‌

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 21, 2023 01:23 PM IST

CM Jagan Fires On Pawan:వాలంటీర్లపై పవన్ కామెంట్ల తర్వాత తొలిసారిగా స్పందించారు ముఖ్యమంత్రి జగన్. పవన్‌ వ్యాఖ్యలు సంస్కారహీనమని మండిపడ్డారు. మంచిచేస్తున్న వ్యవస్థలపై ఇలాంటి వ్యాఖ్యలా అని ప్రశ్నించారు. పవన్ వివాహ జీవితంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్.

సీఎం జగన్ (ఫైల్ ఫొటో)
సీఎం జగన్ (ఫైల్ ఫొటో)

CM Jagan Latest News: వాలంటీర్లను ఉద్దేశిస్తూ జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎండొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా.. వాలంటీర్లను పనిచేస్తున్నారని చెప్పిన జగన్... వారంతా మన కుటుంబ సభ్యులే అని చెప్పారు. వైఎస్సార్‌ నేతన్న నేస్తం నిధుల విడుదల సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి బహిరంగ సభలో మాట్లిడిన జగన్… అవినీతికి, వివక్షకు తావులేకుండా సేవలందిస్తున్నారని కొనియాడారు. పార్టీలు చూడకుండా సేవలందిస్తున్నారని... మన ఊరి పిల్లలైన వాలంటీర్ల మీద తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"స్క్రిప్టు రామోజీరావుది, నిర్మాత చంద్రబాబు, యాక్షన్‌ పవన్‌ కళ్యాణ్‌. వాలంటీర్లు స్క్రీలను లోబర్చుకుంటారని ఒకరు అంటారు. హ్యూమన్‌ ట్రాఫిక్‌ చేస్తారని ఇంకొకరు అంటారు. అబద్ధాలకు రెక్కలు తొడిగి ప్రచారం చేస్తున్నారు. 2.6 లక్షలమంది వాలంటీర్లలో 60శాతం మంది మహిళలే. వాలంటీర్లంతా చదువుకున్న సంస్కారవంతులు. ఇలాంటి వాలంటీర్ల క్యారెక్టర్‌ను తప్పుబట్టిన వారు ఎవరంటే.. ఒకరు పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్‌గా పనిచేస్తున్న వాలంటీర్‌.. ప్యాకేజీ స్టార్‌, ఇంకొకరు చంద్రబాబు. వాలంటీర్ల క్యారెక్టర్‌ గురించి మాట్లాడుతున్నారు. వాలంటీర్లు ఎలాంటి వారో సేవలు అందుకుంటున్న వారికి తెలుసు. చంద్రబాబు క్యారెక్టర్‌, దత్తపుత్రుడి క్యారెక్టర్‌, ఆయన సొంతపుత్రుడి క్యారెక్టర్‌, అలాగే ఆయన బావమరిది క్యారెక్టర్‌ ఏంటో ప్రజలకు బాగా తెలుసు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబరుచుకున్నారా? లేక దత్తపుత్రుడు ఇదే కార్యక్రమం పెట్టుకుని అమ్మాయిలను లోబరుచుకున్నారా? ఒకరిని పెళ్లిచేసుకోవడం… నాలుగేళ్లు కాపురం చేయడం మళ్లీ వదిలేయడం. మళ్లీ ఇంకొకరిని పెళ్లిచేసుకోవడం.. మళ్లీ వదిలేయడం. మళ్లీ పెళ్లి.. మళ్లీ వదిలేయడం. ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో సంబంధం" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి జగన్.

టీడీపీకి బీ టీమ్…

పట్టపగలే మందుకొడుతూ… 10 అమ్మాయిలతో స్విమ్మింగ్‌ పూల్‌లో డ్యాన్స్‌ చేసేవాడు ఇంకొకరు ఉన్నారని జగన్ విరుచుకుపడ్డారు. "ఇంకొకడు.. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంటాడు, లేకపోతే కడుపైనా చేయాలంటాడు మరో దౌర్భ్యాగ్యుడు. వయస్సు 75 ఏళ్లు అయినా సిగ్గులేదు.., ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేశావు.. నేను నిజజీవితంలో చేశాను అంటూ చేసిన వెధవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకరు. ఇలాంటి క్యారెక్టర్‌లేని వాళ్లంతా మంచి చేస్తున్న మన వలంటీర్లు గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్నారు. ఇది కలియుగం కాక మరేమిటి...? ఇలాంటి వారి మెదడు తెరిచి చూస్తే.. పురుగులు కనిపిస్తాయి. పబ్లిక్‌ లైఫ్‌ అయినా అంతే.. పర్సనల్‌ లైఫ్‌ అయినా అంతే.. కుళ్లు.. కుట్రలు కనిపిస్తాయి. బీజేపీతో పొత్తు.. చంద్రబాబుతో కాపురం. ఇచ్చేది తన పార్టీ బీఫాం… టీడీపీకి బీ టీం. చంద్రబాబుపై పోటీ ఒక డ్రామా, బీజేపీతో స్నేహం మరో డ్రామా.. తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా. నిజమేమిటి అని అంటే… స్క్రిప్టు ఈనాడుది, నిర్మాత చంద్రబాబు, నటన మాటలు డైలాగులు అన్నీ దత్తపుత్రుడివి. ఎందుకు ఈస్థాయికి దిగజారిపోయారు. వీళ్లు మంచి చేశారు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు" అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను పరోక్షంగా టార్గెట్ చేశారు జగన్.

నేతన్న నేస్తం నిధులు విడుదల

ఈ సభా వేదిక నుంచే నేతన్న నేస్తం నిధులను విడుదల సీఎం జగన్ విడుదల చేశారు. "వరుసగా 5వ ఏడాది ఈ రోజుతో కలిపి చూస్తే అక్షరాలా లక్షా 20 వేల రూపాయలు ప్రతి నేతన్న చేతిలోనూ పెట్టినట్లయింది. అక్షరాలా 80,686 మంది నా చేనేత అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా బటన్‌ నొక్కి 194 కోట్లు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ ఒక్క పథకం ద్వారా మాత్రమే 50 నెలల కాలంలోనే 5వ ఏడాది ఇస్తూ 970 కోట్లు నా నేతన్నలకు తోడుగా నిలబడే కార్యక్రమం జరిగింది" అని చెప్పుకొచ్చారు.

WhatsApp channel

సంబంధిత కథనం