Cm jagan on Polavram : హామీ మేరకు నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామన్న జగన్
Cm jagan on Polavram : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులు అవుతున్న వారికి అందించే పరిహారం, పునరావాసం విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు పరిస్థితిని ముఖ్యమంత్రి సభ్యులకు వివరించారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ కంటే మెరుగైన పునరావాసం, పరిహారాలను నిర్వాసితులకు కల్పిస్తున్నామని చెప్పారు. పరిహారం చెల్లింపుకు సంబంధించి జీవోలను కూడా విడుదల చేసినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీలో నిర్వహించిన చర్చలో ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి వివరించారు.
Cm jagan on Polavram : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చెప్పిన మాట ప్రకారం జీవో 30ని గత ఏడాది జూన్‌లో విడుదల చేసినట్లు చెప్పారు. పునరావాస, పరిహారం కింది గత ప్రభుత్వ హయంలో రూ.6.86లక్షల పరిహారం చెల్లిస్తే తాము పదిలక్షలు చెల్లిస్తామని చెప్పామని, జీవోలో కూడా ప్రభుత్వం అందించే పరిహారాన్ని స్పష్టంగా ప్రకటించామన్నారు.
పోలవరం బాధితులకు చెల్లించాల్సిన పరిహారం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అమ్మఒడి, ఆసరా వంటి పథకాలకు వేల కోట్లు బదిలీ చేశామని, పోలవరం ప్రాజెక్టు పునరావాస పనులు పూర్తి కాగానే పరిహారం చెల్లింపు చేస్తామని Cm jagan on Polavram స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాశనం చేశారని, దానిని మరమ్మతులకు ప్రభుత్వం కుస్తీ పడుతున్నామని సిఎం జగన్ చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,900కోట్లు నిధులు విడుదల కావాల్సి ఉందని, ఆ నిధులు రాకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని జగన్Cm jagan on Polavram ఆరోపించారు. నిధుల విడుదలలో కేంద్రాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిన తప్పులే ప్రాజెక్టు పాలిట శాపంగా మారాయని ఆరోపించారు. 41.5 మీటర్ల ఎత్తులో నిర్వాసితులయ్యే వారందరికి పరిహారం చెల్లిస్తామన్నారు. గతంలో లక్షన్నర పరిహారం అందుకున్న వారికి ఐదు లక్షల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయంలో 3073మంది కోసం 190 కోట్లు ఖర్చు చేస్తే, తమ హయంలో 10,330 మంది నిర్వాసితులకు 1770కోట్లు ఖర్చు చేశామని సిఎం జగన్ చెప్పారు.
పోలవరం డ్యామ్ నిర్మాణంపై నాడు నేడు అంటూ అసెంబ్లీ లో ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో, గడచిన మూడేళ్ల గా పనుల పురోగతిని ఫోటోలను అసెంబ్లీ లో ప్రదర్శించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద 6.86 లక్షలు కు బదులుగా 10 లక్షలు ఇస్తామని జీవో ఇచ్చినట్లు ప్రకటించారు. 2019-22 వరకూ 10,330 మంది నిర్వాసితులను తరలించామని చెప్పారు. నిర్వాసితులకు చెల్లించడానికి అయ్యే వ్యయం 500 కోట్ల రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్య కాదని వాటిని త్వరలో చెల్లిస్తామన్నారు.
పోలవరం డ్యాం నిర్మాణం అంతా గ్యాప్ లుగా నిర్మించారని జగన్ ఆరోపించారు. 2.1 కి.మీ పొడవున్న గోదావరి నదికి అప్రోచ్ చానల్ కు , లోయర్, అప్పర్ కాపర్,డ్యాం లకు రెండు గ్యాప్ లు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలకు తమ ప్రభుత్వం ఇప్పుడు మరమత్తులు చేయాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు కనీసం శాసన సభ్యుడు అయ్యేందుకు కూడా అర్హత లేదని జగన్ విమర్శించారు. వర్షాకాలం వల్ల పోలవరం పనులు ఆగాయని, నవంబర్ నుండి పనులు ప్రారంభం అవుతాయని Cm jagan on Polavram అసెంబ్లీలో చెప్పారు.