Margadarsi Chits : విచారణకు సహకరించకపోతే మార్గదర్శిని మూసేస్తామంటున్న ఏపీసర్కార్-ap cid says that margadarsi chitfund company not cooperating to investigation officers in rules violation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Margadarsi Chits : విచారణకు సహకరించకపోతే మార్గదర్శిని మూసేస్తామంటున్న ఏపీసర్కార్

Margadarsi Chits : విచారణకు సహకరించకపోతే మార్గదర్శిని మూసేస్తామంటున్న ఏపీసర్కార్

HT Telugu Desk HT Telugu
Mar 13, 2023 02:43 PM IST

Margadarsi Chits మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, విచారణకు సంస్థ సహకరించడం సిఐడి విభాగాధిపతి సంజయ్ ఆరోపించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో కలిసి చేస్తున్న దర్యాప్తుకు మార్గదర్శి సహకరించడం లేదని ఇదే కొనసాగితే మార్గదర్శిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

మార్గదర్శి వ్యవహారంపై వివరణ ఇస్తున్న సిఐడి విభాగాధిపతి సంజయ్
మార్గదర్శి వ్యవహారంపై వివరణ ఇస్తున్న సిఐడి విభాగాధిపతి సంజయ్

Margadarsi Chits మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీలో చోటు చేసుకున్న లొసుగులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, నిబంధనల ఉల్లంఘనపై స్పష్టమైన ఆధారాలు లభించాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ రామకృష్ణ తెలిపారు. సిఐడి డీజీ సంజయ్‌తో కలిసి మార్గదర్శి సంస్థ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 37 బ్రాంచ్ లను నిర్వహిస్తుందని, అయితే చిట్‌ఫండ్‌ నిబంధనల ప్రకారం ఫోర్‌మెన్ కు ఎలాంటి చెక్ పవర్ లేకపోవడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.

yearly horoscope entry point

ఏపీలో లావాదేవీలపై వివరాలు అడిగితే కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లో ఉందని చెబుతున్నారని, అక్కడికి వెళ్లి అడిగితే సమాధానం చెప్పడం లేదన్నారు. దర్యాప్తుకు మార్గదర్శి సంస్థ నుంచి సహకారం లేదన్నారు. ప్రజల డబ్బుకు ఎవరు బాధ్యత వహిస్తారని, మార్గదర్శిలో నిధులను ఉషోదయ కంపెనీకి తరలిస్టున్నారని చెప్పారు. ప్రజల సొమ్మును వారికి తెలియకుండా మూచ్యువల్ ఫండ్స్ కు తరలించారని, సీఐడీ విచారణ తో పాటు చిట్ ఫండ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మార్గదర్శి యాజమాన్యం సహకరించకుండా ఇలాగే కొనసాగితే కంపెనీని మూసివేయాల్సి ఉంటుందన్నారు.

రాష్ట్రంలోని ఏడు ప్రాంతాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ల నుంచి సీఐడీకి ఫిర్యాదులు వచ్చాయని, విశాఖ, విజయవాడ, రాజమండ్రి గుంటూరులో ఫోర్మెన్ ఆఫ్ చిట్స్ ను విచారణ చేశామని సిఐడి చీఫ్ సంజయ్ వివరించారు. 1982 చిట్ ఫండ్ యాక్ట్ 76, 79 సెక్షన్ల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని, అన్ని బ్రాంచుల నుంచి డబ్బు మొత్తం వేరే చోటకు వెళ్ళిపోతుందన్నారు. చిట్టీదారుడకు తన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియదని, జవాబుదారీతనం లేదని తెలియడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు.

కస్టమర్ల డబ్బును వేరే చోట ఇన్వెస్ట్ చేయడం చిట్స్ రూల్సుకు వ్యతిరేకమన్నారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు బ్రాంచుల ఫోర్‌మెన్‌లను కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు. చిట్‌ఫండ్‌ కంపెనీల్లో ఎలాంటి నిబంధనలు ఉంటాయో ప్రజలకు తెలియదని, అసిస్టెంట్ రిజిస్ట్రార్ల అనుమతితోనే చిట్ ప్రారంభించాల్సి ఉందన్నారు. మార్గదర్శి

Whats_app_banner