AP Cabinet Meeting : ఈ నెల 31న ఏపీ కేబినెట్‌ భేటీ-ap cabinet meeting on oct 31 in velagapudi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet Meeting : ఈ నెల 31న ఏపీ కేబినెట్‌ భేటీ

AP Cabinet Meeting : ఈ నెల 31న ఏపీ కేబినెట్‌ భేటీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 21, 2023 11:20 AM IST

AP Cabinet Meeting: ఈ నెల 31వ తేదీన ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. శుక్రవారం రాత్రి ఇందుకు సంబంధించి సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు.

ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ కేబినెట్ భేటీ

AP Cabinet Meeting 2023: ఈనెల 31న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌ సమావేశ మందిరంలో భేటీ కానుంది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. కేబినెట్‌ సమావేశంలో చర్చించే ప్రతిపాదనలు ఈనెల 27వ తేదీలోపు సాధారణ పరిపాలన విభాగానికి పంపాలని అన్ని శాఖలను ఆదేశించారు.

yearly horoscope entry point

మౌలిక సదుపాయాలు కల్పించాలి - సీఎస్

సన్సద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఎంపిక చేసిన గ్రామాల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ…. ఈపధకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లో రహదారి సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఘన,ద్రవ వ్యర్ధాల నిర్వహణ,ఆరోగ్యం,ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు సకాలంలో పూర్తి చేసి ఆయా గ్రామ పంచాయితీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ సన్సద్ ఆదర్శ గ్రామ యోజన పథకం ముఖ్య ఉద్దేశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

సంసద్‌ ఆదర్శ గ్రామీణ యోజన అనేది గ్రామాలలో అభివృద్ధిపై విస్తృతంగా దృష్టి సారించే ఒక గ్రామీణ అభివృద్ధి కార్యక్రమని దీనిని 2014 అక్టోబర్ 11న లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని తెలిపారు. మహాత్మా గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా భారతదేశంలోని గ్రామాల్లో మార్పును తీసుకు రావటం దీని ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఉపాధి అవకాశాల పెరుగుదల, విపరీతమైన బాధల కారణంగా వలసలలో క్షీణత,సరైన రిజిస్ట్రేషన్‌తో జనన మరణాల 100% డాక్యుమెంటేషన్, కమ్యూనిటీలు మంజూరు చేసిన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థ, బానిసత్వం,బాండెడ్ లేబర్, మాన్యువల్ స్కావెంజింగ్, బాల కార్మికుల నుండి సామాజిక స్వేచ్ఛ,వర్గాల మధ్య సామాజిక న్యాయం, సామరస్యం, శాంతిని నెలకొల్పడం, సమగ్ర అభివృద్ధికి ఇతర గ్రామ పంచాయతీలను స్పూర్తిగా నింపడం వంటివి ఈపధకం ముఖ్య ఆశయాలను రాజశేఖర్ స్పష్టం చేశారు. రాష్టంలో 25 మంది లోక్ సభ ఎంపిలు,11మంది రాజ్యసభ ఎంపిలు ఉన్నారని ప్రతి ఒక్కరూ ఒక గ్రామ పంచాయితీని దత్తత తీసుకుని ఆ గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు సమగ్రమైన సాంఘిక పురోగతి చోటు చేసుకొనే విధంగా మార్గదర్శకత్వం వహించాలనేది ఆపధకం ముఖ్య ఉద్యేశ్యమని పేర్కొన్నారు. ఈ విధంగా దత్తత తీసుకున్న గ్రామాల్లో ముఖ్యంగా పూర్తి స్థాయిలో రహదారి కనక్టవిటీ,తాగునీటి సరఫరాలో స్వయం సమృద్ధి, ఆర్గానిక్ ఫార్మింగ్, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ,రెన్యువల్ ఎనర్జీ,పాఠశాలల్లో నూరు శాతం ఎన్రోల్మెంట్,ఆరోగ్యం,ఆ గ్రామ పంచాయితీ పూర్తిగా డిజిటైజేషన్,సామాజిక భద్రత పధకంలో నూరు శాతం ఎన్రోల్మెంట్, అడవుల పెంపకం కార్యక్రమం వంటి చేపట్టాలనేది ఈపధకం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

Whats_app_banner