Police Medals: ఏపీ,తెలంగాణ పోలీసుల‌కు పంద్రాగ‌స్టు మెడ‌ల్స్,ఏపీకి 26,తెలంగాణకు 29, యాద‌య్య‌కు రాష్ట్ర‌ప‌తి శౌర్య ప‌త‌కం-ap and telangana police received pandragastu medals 26 for ap and 29 for telangana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Police Medals: ఏపీ,తెలంగాణ పోలీసుల‌కు పంద్రాగ‌స్టు మెడ‌ల్స్,ఏపీకి 26,తెలంగాణకు 29, యాద‌య్య‌కు రాష్ట్ర‌ప‌తి శౌర్య ప‌త‌కం

Police Medals: ఏపీ,తెలంగాణ పోలీసుల‌కు పంద్రాగ‌స్టు మెడ‌ల్స్,ఏపీకి 26,తెలంగాణకు 29, యాద‌య్య‌కు రాష్ట్ర‌ప‌తి శౌర్య ప‌త‌కం

HT Telugu Desk HT Telugu
Aug 15, 2024 06:26 AM IST

Police Medals: ఏపీ, తెలంగాణ పోలీసుల‌కు పంద్రాగ‌స్టు మెడ‌ల్స్ వరించాయి. ఈ పతకాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 26, తెలంగాణ‌కు 29 ఉన్నాయి. తెలంగాణ‌కు చెందిన చ‌దువు యాద‌య్య‌కు రాష్ట్ర‌ప‌తి శౌర్య ప‌త‌కం దక్కింది. గ్యాలంట్రీ మెడ‌ల్స్ లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నాలుగు మెడల్స్‌, తెలంగాణకు ఏడు మెడల్స్‌ దక్కాయి.

ఏపీ, తెలంగాణ పోలీసులకు  పంద్రాగస్టు సందర్బంగా పోలీస్ మెడల్స్‌
ఏపీ, తెలంగాణ పోలీసులకు పంద్రాగస్టు సందర్బంగా పోలీస్ మెడల్స్‌ (Hindustan Times)

Police Medals: ఏపీ, తెలంగాణ పోలీసుల‌కు పంద్రాగ‌స్టు మెడ‌ల్స్ వ‌రించాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 26, తెలంగాణ‌కు 29 మెడ‌ల్స్ వ‌చ్చాయి. తెలంగాణ‌కు చెందిన చ‌దువు యాద‌య్య‌కు రాష్ట్ర‌ప‌తి శౌర్య ప‌త‌కం వ‌రించింది. దేశ‌వ్యాప్తంగా ఒకే రాష్ట్రప‌తి శౌర్య ప‌త‌కం (పీఎంజీ) ప్ర‌క‌టించగా అది, తెలంగాణ‌కు చెందిన చ‌దువు యాద‌య్య‌కు ద‌క్కింది.

ఇక గ్యాలంట్రీ మెడ‌ల్స్ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నాలుగు మెడల్స్‌, తెలంగాణకు ఏడు మెడల్స్‌ దక్కాయి. పీఎస్ఎంలో ఏపీకి రెండు, తెలంగాణ‌కు మూడు మెడ‌ల్స్ ద‌క్కాయి. ఎంఎస్‌ఎంలో ఏపీకి 20, తెలంగాణకు 18 మెడల్స్‌ వచ్చాయి.

స్వాతంత్య్ర, గ‌ణ‌తంత్ర దినోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని కేంద్ర హోం శాఖ ఏటా రెండు సార్లు ఈ పోలీసు ప‌త‌కాల‌ను ప్ర‌క‌టిస్తోంది. స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పోలీసు, ఫైర్ స‌ర్వీస్‌, హోంగార్డ్‌, సీవిల్ డిఫెన్స్ అధికారుల‌కు వివిధ పోలీసు ప‌త‌కాల‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధ‌వారం ప్ర‌క‌టించింది.

దేశ‌వ్యాప్తంగా 1,037 మందికి గ్యాలంట్రీ, స‌ర్వీసు ప‌త‌కాలు అంద‌జేయ‌నుంది. ఈ మేర‌కు అవార్డుల జాబితాను విడుద‌ల చేసింది. 213 మందికి గ్యాలంట్రీ (శౌర్య‌) మెడ‌ల్స్ (జిఎం), ఒక‌రికి రాష్ట్ర‌ప‌తి శౌర్య ప‌త‌కం (పిఎంజి), 94 మందికి విశిష్ట సేవ రాష్ట్రపతి మెడ‌ల్ (పిఎస్‌ఎం) మెడల్స్‌, 729 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్ (ఎంఎస్‌ఎం) ప్రకటించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడ‌ల్స్ (26)

గ్యాలంట్రీ మెడ‌ల్ (జీఎం) షేక్ సర్దార్ ఘని (ఇన్స్పెక్టర్), సవ్వన అరుణ్ కుమార్ (ఎస్ఐ), మైలపల్లి వెంకట రామ పరదేశి నాయుడు (రిజర్వ్ ఎస్ఐ), రాజనా గౌరీ శంకర్ (హెడ్ కానిస్టేబుల్)కు ద‌క్కాయి.

విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి మోడ‌ల్ (పీఎస్ఎం) రవి ప్రకాష్ మీసాల (ఐజీ), దండు గంగ రాజు దాసరి (ఇన్‌స్పెక్టర్) ద‌క్కాయి.

మెరిటోరియస్ సర్వీస్ మెడల్ (ఎంఎస్ఎం) విష్ణు నార్నిడి (ఎఎస్‌పీ), లక్ష్మి ఎన్ఎస్‌జె (డీఐజీ), గోపాల కృష్ణ సోమసాని (డీఎస్‌పీ), మురళీ కృష్ణ తక్కెళ్లపాటి (డీఎస్‌పీ), రామచంద్ర మూర్తి కొండుమహంతి (ఏఎస్‌పీ), ఉదయ భాస్కర్ దేశబత్తిన (గ్రూప్ కమాండర్), శ్రీనివాసులు పెదరసి (డీఎస్‌పీ), కృష్ణ మూర్తి రాజు కానుమూరి (ఇన్‌స్పెక్టర్), లక్ష్మీ నరసింహరావు సిరికి (ఏఎస్ఐ), రమేష్ బాబు కాట్రగడ్డ (కానిస్టేబుల్), శ్రీనివాసరావు గడ్డం (ఎఎస్ఐ), వీర వెంకట సత్య సాంబశివ రావు తోటకూర (ఏఎస్ఐ), వెంకట సుబ్బారాయుడు జింకా (ఏఎస్ఐ), రామ చంద్ర శేఖర రావు మండ (హెడ్ కానిస్టేబుల్), జయచంద్రారెడ్డి వద్దిరెడ్డి (హెడ్ కానిస్టేబుల్), డి. భక్తవాచల రాజు (ఏఎస్ఐ), చిన్న సైదా షేక్ (ఏఎస్ఐ), కె. గోవింద రాజులు (ఏఎస్ఐ), షరీఫ్ మహబూబ్ (ఎస్ఐ), ఫైర్ స‌ర్వీస్ విభాగంలో చిన్నం మార్టిన్ లూథర్ కింగ్, (అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్)ల‌కు అవార్డులు ద‌క్కాయి.

తెలంగాణ మెడ‌ల్స్ (29)

రాష్ట్ర‌ప‌తి శౌర్య ప‌త‌కం(పీఎంజీ) తెలంగాణ పోలీసు శాఖ‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ చ‌దువు యాద‌య్య‌కు ల‌భించింది.

గ్యాలంట్రీ (శౌర్య‌) మెడ‌ల్స్ (జీఎం) సునీల్ దత్ (ఎస్‌పీ), మోరా కుమార్ (డిప్యూటీ అసాల్ట్ కమాండర్ / రిజర్వ్ ఇన్స్పెక్టర్), శనిగరపు సంతోష్ (అసిస్టెంట్ అసాల్ట్ కమాండర్ / రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్), అమిలి సురేష్ (జూనియర్ కమాండో / పోలీస్ కానిస్టేబుల్), వెల్ముల వంశీ (జూనియర్ కమాండో /పోలీస్ కానిస్టేబుల్), కంపాటి ఉపేందర్ (జూనియర్ కమాండో / పోలీస్ కానిస్టేబుల్), పాయం రమేష్ (జూనియర్ కమాండో / పోలీస్ కానిస్టేబుల్)ల‌కు ద‌క్కాయి.

విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి మెడ‌ల్స్ (పీఎస్ఎం) సంజయ్ కుమార్ జైన్ (ఏడీజీ), కటకం మురళీధర్ (డీసీపీ), ఫైర్ స‌ర్వీస్ విభాగంలో వెంకటేశ్వర్లు కందిమల్ల (డ్రైవర్ ఆపరేటర్)ల‌కు ద‌క్కాయి.

మెరిటోరియస్ సర్వీస్ మెడల్ (ఎంఎస్ఎం) అవినాష్ మొహంతి (పోలీస్ కమీషనర్), సయ్యద్ జమీల్ బాషా (కమాండెంట్), పీ.కృష్ణ మూర్తి (ఏఎస్‌పీ), కొమరబత్తిని రాము (ఎస్ఐ), అబ్దుల్ రఫీక్ (ఎస్ఐ), ఇక్రమ్ అబ్ ఖాన్ (ఎస్ఐ), శ్రీనివాస మిశ్రా (ఎస్ఐ), కుంచాల బాలకాశయ్య (ఎస్ఐ), లక్ష్మయ్య (ఎఎస్ఐ), గుంటి వెంకటేశ్వర్లు (ఏఎస్ఐ), నూతలపాటి జ్ఞాన సుందరి (ఇన్‌స్పెక్టర్), ఫైర్ స‌ర్వీస్ విభాగంలో మాధవరావు తెలుగు (లీడింగ్ ఫైర్‌మెన్), వాహెదుద్దూన్ మహ్మద్ (లీడింగ్ ఫైర్‌మెన్), హోంగార్డ్ విభాగంలో లక్ష్మి బందోళ్ల (ఉమెన్ హోం గార్డ్), మల్లేష్ మేడిపల్లి (హోం గార్డ్), కవిత ఇంటూరి (ఉమెన్ హోం గార్డ్), గాలయ్యా నమల (హోం గార్డ్), సుమలత ఎనుముల (ఉమెన్ హోం గార్డ్) ద‌క్కాయి.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)