ANU Degree LLB Results : ఏఎన్‌యూ డిగ్రీ, ఎల్ఎల్బీ సెమిస్టర్ ఫలితాలు విడుదల- ఇలా చెక్ చేసుకోండి
ANU Degree LLB Results : ఏఎన్‌యూ డిగ్రీ, ఎల్ఎల్బీ సెమిస్టర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ANU Degree LLB Results : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ, న్యాయ విద్యా పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల రెండో సెమిస్టర్, ఎల్ఎల్‌బీ మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్, ఐదో సంవత్సరం ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.గంగాధరరావు విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన డిగ్రీ పరీక్షలకు 9,792 మంది హాజరవ్వగా, అందులో 5,670 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://www.vidyavision.com/results/anuug2sem2507204.aspx లో చూడొచ్చు. ఎల్ఎల్‌బీ మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్, ఐదో సంవత్సరం ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ అధికారక వెబ్‌సైట్ డైరెక్ట లింక్ https://www.nagarjunauniversity.ac.in/results/pg/llb3yrs1stand5yrs8thsemregapril2024.php లో చూడొచ్చు. ఎల్ఎల్‌బీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ అధికారక వెబ్‌సైట్ డైరెక్ట లింక్ https://www.nagarjunauniversity.ac.in/results/pg/llm1stsemregapril2024.php లో చూడొచ్చు. ఎగ్జామ్ హాల్‌టిక్కెట్టు నెంబర్ ఎంటర్ చేస్తే ఫలితాలు డిస్‌ప్లే వెల్లడి అవుతాయి.
పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్‌కు ఆగస్టు 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్ రెడ్డి ప్రకాశరావు తెలిపారు. ఒక్కో పేపర్‌కు రూ.1,240 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే పర్సనల్ వెరిఫికేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ. 1,260 చెల్లించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆయా కాలేజీల ప్రిన్సిపాల్ ద్వారా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల కో ఆర్డినేటర్ కార్యాలయానికి పంపాలని తెలిపారు.
ఆంధ్ర కేసరి వర్సిటీ లా మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఆంధ్ర కేసరి యూనివర్సిటీ (ఏకేయూ) పరిధిలో న్యాయ విద్య మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలోని రెండు లా కాలేజీల్లో మూడేళ్ల లా కోర్సు పరీక్షలకు 320 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో 223 మంది ఉత్తీర్ణత సాధించారు. 69.7 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వర్సిటీ వైస్ ఛాన్సలర్ డీవీఆర్ మూర్తి తెలిపారు. ఐదేళ్ల లా కోర్సుకు సంబంధించి 64 మంది విద్యార్థులు పరీక్షలను రాయగా, 40 మంది ఉత్తీర్ణత సాధించారు. 62.05 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండేళ్ల పీజీ లా కోర్సు పరీక్షలను 44 మంది విద్యార్థులు రాయగా, 40 మంది పాస్ అయ్యారు. 91 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఏకేయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ డాక్టర్ కేవీఎన్ రాజు తెలిపారు.
అనంతపురం జేఎన్‌టీయూ బీటెక్ ఫలితాలు విడుదల
అనంతపురం జేఎన్‌టీయూ బీటెక్ ఫలితాలు విడుదల అయ్యాయి. జేఎన్‌యూటీ క్యాంపస్ కాలేజీలో ఇటీవల నిర్వహించిన బీటెక్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్‌వీ సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాల కోసం కాలేజీ అకడమిక్ సెక్షన్‌లో సంప్రదించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ లలిత కుమారి తెలిపారు. అలాగే 2024 మే, జూన్‌లో జరిగిన ఎంటెక్ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://jntuaresults.ac.in/view-results?resultSetId=ab848678-e818-440b-83ef-668d7325c1bc లో చూడొచ్చు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం