Telugu News Updates 05 March: పశ్చిమగోదావరి జిల్లాకు సీఎం జగన్
- ఏపీ సీఎం జగన్ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడిలో పర్యటించనున్నారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. సాయంత్రం 3.50 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 4.20 గంటలకు కలగంపూడి చేరుకుంటారు. 4.30 గంటలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరు అవుతారు. అనంతరం 5.15 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 5.55 తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు. మరిన్ని తాజా వార్తల కోసం లైవ్ పేజీని రిఫ్రెష్ చేయండి……
Sun, 05 Mar 202307:41 AM IST
రేవంత్ రెడ్డి పూజలు
రేవంత్ రెడ్డి పాదయాత్ర వేములవాడకు చేరింది. ఈ సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... వేములవాడ రాజన్నను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ యువతపై ఉందన్నారు. విజిటింగ్ ప్రొఫెసర్ మాదిరిగా స్థానిక ఎమ్మెల్యే రమేశ్ ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఓడించాలన్నారు. స్థానికంగా ఉండే బిడ్డను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని చెప్పారు.
Sun, 05 Mar 202305:43 AM IST
డేట్స్
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పలు ఉద్యోగాల నోటిఫికేషన్ల పరీక్షల తేదీలు విడుదలైన సంగతి తెలిసిందే. ఆయా పరీక్షల తేదీలన్నీ ఇక్కడ చూడండి...
వివరాలను చూస్తే....
- వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష తేదీ -
మార్చి - 15,16 - 2023
- అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్
పరీక్ష తేదీ: ఏప్రిల్ -23- 2023
- అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష తేదీ
ఏప్రిల్ - 25 - 2023
- డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పరీక్ష తేదీ
మే - 7 - 2023
- భూగర్భ జల వనరుల శాఖ (గెజిటెడ్)
పరీక్ష తేదీ - ఏప్రిల్ - 26, 27 - 2023
నాన్ గెజిటెడ్ - పరీక్ష తేదీ - మే - 15, 16 -2023
-ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీ
మే - 17- 2023
-గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్ష తేదీ
జూన్ - 5 నుంచి 12 - 2023
- Group - 4 పరీక్ష తేదీ
జూలై -1- 2023
- గ్రూప్ - 2 పరీక్ష తేదీ
ఆగస్ట్ - 29,30 -2023
Sun, 05 Mar 202304:43 AM IST
రేవంత్ ఫైర్
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ పిచ్చి కుక్కలా మారి కరుస్తున్నారంటూ మండిపడ్డారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా శనివారం సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని పద్మానగర్ నుంచి సిరిసిల్ల వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సిరిసిల్ల నేతన్న చౌక్ లో నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
Sun, 05 Mar 202303:34 AM IST
పనుల పరిశీలన
ఈ సీజన్‌లో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామన్నారు మంత్రి మంత్రి అంబటి రాంబాబు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతోనే పనుల్లో జాప్యం జరుగుతోందని అన్నారు. ఆదివారం ప్రాజెక్ట్ పనులను పరీశిలించారు.
Sun, 05 Mar 202303:33 AM IST
కేరళ ట్రిప్ ప్యాకేజీ
సమ్మర్ వచ్చేసింది...! అయితే చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం చూస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా కేరళ ట్రిప్ ప్లాన్ చేసే వారికోసం సూపర్ ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి కేరళలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ.
5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ మార్చి 14వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు.ఈ ట్రిప్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.
Sun, 05 Mar 202303:01 AM IST
టీడీపీ నేత మృతి
ఇక కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌ఛార్జి వరుపుల రాజా గుండెపోటుతో చనిపోయారు. శనివారం రాత్రి ఉన్నట్టుండి ఆయనకు గుండె దగ్గర నొప్పి రావడంతో ఆయన్ను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా.. ఆయన కన్నుమూశారు. రాజా హఠాన్మరణంతో.. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. వరుపుల రాజా ప్రస్తుతం బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాలకు టీడీపీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన... ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు. శనివారం కూడా ప్రచారం చేసి సాయంత్రానికి సొంతూరైన ప్రత్తిపాడు వెళ్లారు. ఆ తర్వాత కూడా బిజీగా గడిపారు. పార్టీ కార్యకర్తలు, బంధువుల మాట్లాడుతూ ఉండగా... రాత్రి 8 తర్వాత గుండె దగ్గర నొప్పి వచ్చింది. వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
Sun, 05 Mar 202302:34 AM IST
మరో స్కీమ్
‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8 నుంచి ఈ కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వివరాలను వెల్లడించారు.
Sun, 05 Mar 202302:01 AM IST
ప్రత్యేక పథకం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి ఈ నెల 8 నుంచి శ్రీకారం చుడుతున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
Sun, 05 Mar 202302:01 AM IST
దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష
మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ (NEET PG) పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరుగనుంది.
Sun, 05 Mar 202302:00 AM IST
ఆగిపోయిన గుండె
ఉపాధ్యాయుడు గుండెపోటుతో కూర్చున్న కుర్చీలోనే ఒరిగిపోయారు. ఈ హృదయ విదారక ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో చోటుచేసుకుంది.
Sun, 05 Mar 202301:59 AM IST
గంజాయి సీజ్
Ganja Seized at Choutuppal : వైజాగ్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న 400 కేజీల గంజాయిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేయగా... రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Sun, 05 Mar 202301:59 AM IST
ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల
Telangana EDCET Schedule 2023: తెలంగాణ ఎడ్ సెట్ 2023 నోటిఫికేషన్ వచ్చేసింది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీతో పాటు పలు వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
Sun, 05 Mar 202301:57 AM IST
సీఎం జగన్ టూర్
ఏపీ సీఎం జగన్ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడిలో పర్యటించనున్నారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. సాయంత్రం 3.50 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 4.20 గంటలకు కలగంపూడి చేరుకుంటారు. 4.30 గంటలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరు అవుతారు. అనంతరం 5.15 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 5.55 తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు