Input Subsidy : నేడు ఏపీలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ….-andhra pradesh cm will release input subsidy amounts to farmers bank accounts virtually ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Cm Will Release Input Subsidy Amounts To Farmers Bank Accounts Virtually

Input Subsidy : నేడు ఏపీలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ….

HT Telugu Desk HT Telugu
Nov 28, 2022 09:10 AM IST

Input Subsidy ఏపీలో నేడు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని పంపిణీ చేయనున్నారు. దీంతో పాటు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలను రైతుల ఖాతాల్లో వేయనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా వీటిని పంపిణీ చేయనున్నారు.

నేడు ఏపీలో రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ
నేడు ఏపీలో రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ (Hindustan Times)

Input Subsidy ఏపీ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్ముతో పాటు, గతంలో వివిధ సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు పొందని వారి అకౌంట్లలో జమ చేసే సొమ్ముతో కలిపి మొత్తం రూ. 200 కోట్లను సీఎం క్యాంప్‌ కార్యాలయం నుండి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగానే నష్టపరిహారం చెల్లిస్తామన్న మాట ప్రకారం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నారు. 2022 జులై – అక్టోబర్‌ మధ్య ఖరీఫ్‌ సీజన్‌లో కురిసిన అధిక వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన 45,998 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతన్నలకు రూ. 39.39 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఖరీఫ్‌ 2022 ముగియక ముందే రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారు.

మూడో విడతలో జమ చేస్తున్న రూ. 39.39 కోట్లతో కలిపి ‌వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 21.31 లక్షల మంది రైతులకు రూ.1,834.79 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించారు. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు సత్వర ఉపశమనం కల్పించేలా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌ ముగిసేలోగానే నష్టపరిహారం పంపిణీ చేస్తున్నారు

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు….

పంటలు వేసే ప్రతిసారి రైతులు పెట్టుబడి ఖర్చుల కోసం అధిక వడ్డీల వలలో చిక్కకూడదన్న ఉద్దేశంతో సన్న, చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు అందిస్తున్నారు. వరుసగా మూడో ఏడాది రబీ 2020 – 21, ఖరీఫ్‌ 2021లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 8,22,411 మంది రైతన్నలకు రూ. 160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును వారి ఖాతాల్లో నేడు జమ చేస్తున్నారు.

గతంలో ఉన్న బకాయిలు రూ. 1,180 కోట్లతో పాటు నేడు అందించే రూ. 160.55 కోట్లతో కలిపి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల క్రింద 73.88 లక్షల మందికి అందించిన వడ్డీ రాయితీ రూ. 1,834.55 కోట్లుగా ఉంది.

అన్నదాతలు అధిక వడ్డీలతో అప్పుల ఊబిలో కూరుకుపోకుండా వారికి అండగా నిలుస్తూ , ఈ – క్రాప్‌ డేటా ఆధారంగా లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకుని ఏడాది లోపు తిరిగి చెల్లించిన రైతన్నలకు పూర్తి వడ్డీ రాయితీని క్రమం తప్పకుండా ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వం మూడేళ్ళ ఐదు నెలల్లో వివిధ పథకాల క్రింద రైతులకు అందించిన సాయం రూ. 1,37,975.48 కోట్లుగా ఉంది.

ఈ– క్రాప్‌ ఆధారంగా నమోదయిన వాస్తవ సాగుదార్లకు నేరుగా వారి ఖాతాల్లోనే ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగా పరిహారం అందిస్తున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సోషల్‌ ఆడిట్‌ కొరకు రైతు భరోసా కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితాల ప్రదర్శిస్తున్నారు. గ్రామ స్ధాయిలోనే రైతులు తమ వివరాలు చూసుకుని పేర్లు లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

IPL_Entry_Point