January 31 Telugu News Updates : విశాఖే రాజధాని… అక్కడికే వెళుతున్నా…సిఎం జగన్
- ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ పట్నం రాజధాని కాబోతుందని, త్వరలోనే విశాఖపట్నంలో రాజధాని ఏర్పడుతుందని, తాను కూడా అక్కడికే వెళుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రాజధాని కాబోతున్న విశాఖపట్నానికి పెట్టుబడులు పెట్టేందుకు తరలి రావాలనికోరారు. న్యూ ఢిల్లీ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ డిప్లమాటిక్ అలయన్స్ మీట్‌లో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. మార్చిలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం తరలి రావాలని సిఎం విజ్ఞప్తి చేశారు.
Tue, 31 Jan 202310:07 AM IST
ఆ వివరాలు బయటకు ఎలా తెలిశాయంటున్న సుబ్బారెడ్డి
వైఎస్ అవినాష్‍రెడ్డి కాల్ డేటాపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఇంట్లో మనం అనుకున్న వాళ్లు ఫోన్లు తీయకుంటే కొన్నిసార్లు సన్నిహితులు, పనివాళ్లకు కాల్ చేస్తామని, అవినాశ్ కూడా నవీన్ అనే వ్యక్తికి కాల్ చేశారని, తాను కూడా భారతమ్మ ఫోన్ తీయకపోతే నవీన్‍కు కాల్ చేస్తానని చెప్పారు. ఫోన్ కాల్స్ విషయాలు పేపర్లకు ఎలా తెలుస్తున్నాయని,దానిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
Tue, 31 Jan 202308:11 AM IST
గ్లొబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో సిఎం జగన్
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ పాల్గొన్నారు. వివిధ దేశాల దౌత్యవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో సిఎం పాల్గొన్నారు. వివిధ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు సదస్సును నిర్వహిస్తున్నారు.
Tue, 31 Jan 202308:08 AM IST
కోటంరెడ్డి తప్పు చేస్తున్నారు….బాలినేని
కోటంరెడ్డికి ఏదో తప్పు చేస్తున్నానన్న అభద్రతాభావం ఉందని, అందుకే.. ఫోన్ ట్యాపింగ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరమేంటని, సమస్యలుంటే సీఎం జగన్‍తో మాట్లాడి పరిష్కరించుకోవాలన్నారు. తప్పు చేస్తున్నాననే భావనతోనే కోటంరెడ్డి ఇలా మాట్లాడుతున్నారన్నారు.
Tue, 31 Jan 202307:59 AM IST
ఉద్యోగుల సంఘం పిటిషన్‍పై హైకోర్టులో విచారణ
ఉద్యోగుల సంఘం పిటిషన్‍పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపులా వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పు వెలువరించే వరకు ఉద్యోగులపై చర్యలొద్దని ఆదేశించారు. షోకాజ్ నోటీసుల ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. జీతాల విషయంలో గవర్నర్‍కు వినతిపత్రం ఇచ్చినందుకు షోకాజ్ నోటీసులు చేయడంపై ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.
Tue, 31 Jan 202311:25 AM IST
వైసీపీకి గుడ్‌బై చెప్పనున్న కోటంరెడ్డి…?
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‍రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. - వైసీపీ అధిష్టానం స్పందన కోసం కోటంరెడ్డి నిరీక్షిస్తున్నారు. వైసీపీ నుంచి స్పందన వచ్చిన తర్వాత పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. తాజా పరిణామాలపై డివిజన్ నేతలతో కోటంరెడ్డి సమావేశం నిర్వహించారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‍లో టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ టికెట్ ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అనుచరులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపినట్లు తెలుస్తోంది.