Murder Attempt: వివా‍హితతో సంబంధం, అనుమానంతో హత్యాయత్నం..-an affair with a married woman and then an attempted murder on suspicion ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Murder Attempt: వివా‍హితతో సంబంధం, అనుమానంతో హత్యాయత్నం..

Murder Attempt: వివా‍హితతో సంబంధం, అనుమానంతో హత్యాయత్నం..

HT Telugu Desk HT Telugu
Jul 11, 2023 09:32 AM IST

Murder Attempt: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళపై అనుమానంతో హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన విజయవాడ శివార్లలో జరిగింది. తనతో సన్నిహితంగా ఉంటూనే మరొకరితో మాట్లాడుతుందనే అనుమానంతో హత్యాయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు.

వివాహేతర సంబంధం నేపథ్యంలో  మహిళపై హత్యాయత్నం
వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళపై హత్యాయత్నం

Murder Attempt: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ మీద అనుమానంతో హత్యాయత్నం చేసిన ఘటన విజయవాడ శివార్లలో జరిగింది. తనతో సన్నిహితంగా ఉంటూనే మరొకరితో మాట్లాడుతుందనే అనుమానంతో హత్యాయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ నగర శివారు నున్న-ముస్తాబాద ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది.

విజయవాడ నగరానికి చెందిన ఓ మహిళ.. తన భర్త పిల్లలతో కలిసి ఉంటోంది. బర్రె కిరణ్‌ అనే వ్యక్తి కూడా తన భార్యతో కలిసి నగరంలోనే ఉంటున్నాడు. అతడు కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఇద్దరి మధ్య పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇటీవల ఆ మహిళ మరొకరితో వాట్సప్‌లో ఛాటింగ్‌ చేస్తోందని, ఫోన్లో మాట్లాడుతుందని కిరణ్‌ అనుమానం పెంచుకున్నాడు.

తనతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ.. మరొకరితో సన్నిహితంగా ఉంటుందని కక్ష కట్టాడు. ఆమెను ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల సమయంలో శిశు సంక్షేమ శాఖకు చెందిన నగదును బ్యాంకు నుంచి తీసుకోవాలని చెప్పి ఆమెను తన వెంట కారులో తీసుకువెళ్లాడు.

బాధిత మహిళను కారులో ఎక్కించుకుని విజయవాడ నగర శివారు నున్న వైపు బయలుదేరాడు. మార్గమధ్యలో కారును కృష్ణా జిల్లా గన్నవరం స్టేషన్‌ పరిధిలోని ముస్తాబాద గ్రామంలోని లంబాడీ పేట వైపు మళ్లించాడు. నిర్మానుష్య ప్రదేశంలోకి కారును తీసుకెళ్లి ఆపాడు.

ఆ తర్వత ఆమెత వాగ్వాదానికి దిగి, ఫోనులో ఎవరితో మాట్లాడుతున్నావంటూ గొడవకు దిగాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. పెనుగులాటలో మహిళకు వీపు, చేతిపై గాయాలయ్యాయి. దీంతో సదరు మహిళ గట్టిగా కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న లారీ డ్రైవర్‌ అప్రమత్తమై, స్థానికులతో కలిసి నిందితుడిని అడ్డుకుని డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

వెంటనే నున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. గన్నవరం స్టేషన్‌ పరిధి కావడంతో, నిందితుడు కిరణ్‌ను గన్నవరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కనకారావు తెలిపారు.

నిందితుడు కిరణ్‌ తనతో సంబంధం ఉన్న మహిళను అంతమొందించాలని పక్కా పథకంతో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను చంపడానికి కత్తి, రాడ్డు, గొంతు నులమడానికి వైరు, శవాన్ని చుట్టడానికి గోనె పట్టా, తగలబెట్టడానికి పెట్రోల్‌ డబ్బాలను కారులో తీసుకొచ్చాడు. నిందితుడికి పిల్లలు లేరని భార్యకు తెలియకుండా నగరానికి చెందిన మహిళతో గత 12 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధితురాలి భర్త కూడా ప్రైవేట్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండటంతో వారి మధ్య పరిచయం ఏర్పడిందని వివరించారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.

Whats_app_banner