Aarogyasri Limit Hike : సీఎం జగన్ సంచలన నిర్ణయం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు
Aarogyasri Limit Hike : ఆరోగ్య శ్రీ పథకం పరిమితి పెంచుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించారు.
Aarogyasri Limit Hike : ఆరోగ్య శ్రీపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన నూతన మార్గదర్శకాలపై ఈనెల 18న సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సిబ్బంది, గృహ సారథులు, వాలంటీర్లను ఉద్దేశించి సీఎం జగన్ ఈ నెల 18న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి రాష్ట్రంలోని 1.42 కోట్ల మందికి కొత్తగా రూపొందించిన ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ చేయనున్నారు. దీంతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ.25 లక్షల పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఖర్చు వెయ్యి దాటితో ఆరోగ్య శ్రీ
గతంలో క్యాన్సర్ చికిత్సకు ఆరోగ్య శ్రీలో రూ.5 లక్షల పరిమితి ఉండేదని, ఇప్పుడు ఈ పరిమితి ఎత్తేయడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా ఉంటుందని అధికారులు తెలిపారు. వైసీపీ అధికారంలోకి నాటి నుంచి 2023 నవంబర్ వరకూ ఆరోగ్య శ్రీ పథకం కింద 37,40,525 మంది ఉచిత వైద్య సేవలు అందుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.11,859 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. వైద్యానికి ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స అందిస్తారు. నాలుగున్నరేళ్లలో ఆరోగ్య శ్రీ, ఆసరా పథకం కోసం రూ.13,168 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక సమాచారం. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 54 క్యాన్సర్ చికిత్సలు సహా మొత్తం 3,257 చికిత్సలు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఆరోగ్య శ్రీ కవరేజీ చికిత్సలు
- కార్డియాక్ & కార్డియోథొరాసిక్ సర్జరీ
- కార్డియాలజీ
- కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ
- డెర్మటాలజీ
- ఎడోక్రినాలజీ
- ENT సర్జరీ
- గ్యాస్ట్రోఎంటరాలజీ
- సాధారణ వైద్యం
- సాధారణ శస్త్రచికిత్స
- జెనిటో యూరినరీ సర్జరీలు
- గైనకాలజీ, ప్రసూతి శస్త్రచికిత్స
- మెడికల్ ఆంకాలజీ
- నెఫ్రోలజీ
- న్యూరాలజీ
- న్యూరోసర్జరీ
- ఆప్తమాలజీ సర్జరీ
- ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ
- ఆర్థోపెడిక్ సర్జరీ, విధానాలు
- పీడియాట్రిక్ సర్జరీలు
- పీడియాట్రిక్స్
- చర్మానికి సంబంధించిన శస్త్రచికిత్స
- పాలీ ట్రామా
- మనోరోగ చికిత్స
- పల్మోనాలజీ
- రేడియేషన్ ఆంకాలజీ
- సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ
- రుమటాలజీ
- సర్జికల్ ఆంకాలజీ