AP Pensions : మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి, ఎన్డీఏ నేతల డిమాండ్-amaravati nda leaders demands pension distribution on may 1st door to door ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pensions : మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి, ఎన్డీఏ నేతల డిమాండ్

AP Pensions : మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి, ఎన్డీఏ నేతల డిమాండ్

Bandaru Satyaprasad HT Telugu
Apr 27, 2024 07:32 PM IST

AP Pensions : మే 1న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని ఎన్డీఏ కూటమి నేతలు సీఎస్ జవహర్ రెడ్డిని కోరారు. దురుద్దేశ పూర్వకంగా పింఛన్ల పంపిణీలో కాలయాపన చేస్తే సీఎం, సీఎస్ లదే బాధ్యత అన్నారు.

సీఎస్ కు వినతి పత్రం అందిస్తోన్న ఎన్డీఏ నేతలు
సీఎస్ కు వినతి పత్రం అందిస్తోన్న ఎన్డీఏ నేతలు

AP Pensions : మే 1న వృద్ధాప్య పెన్షన్లన్నీ(AP Pensions) ఇంటి వద్దనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ నేతలు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy)ని కోరారు. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన ఎన్డీఏ కూటమి(NDA Leaders) నేతల బృందం వినతి పత్రం అందించారు. అనంతరం సచివాలయంలో ఆకస్మికంగా నిరసనకు దిగారు. దురుద్దేశ పూర్వక పింఛన్ల పంపిణీకి కాలయాపన చేస్తే, వృద్ధులకు ఏదైనా జరిగితే సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డిలదే బాధ్యత అని ఆరోపించారు.

మే 1న ఇంటి వద్దే పింఛన్

ఏప్రిల్ లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు సంబంధించిన రూ.13 వేల కోట్ల బిల్లులను ఖజానా ఖాళీచేసి చెల్లించారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఏప్రిల్ 3వ తేదీ వరకు సచివాలయాల వద్ద పెన్షన్ దారులకు(AP Pensions) డబ్బులు చేరక 33 మంది లబ్ధిదారులు చనిపోయారన్నారు. సీఎస్ జవహర్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా వైసీపీ పార్టీకి లబ్ది చేయాలని కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు 24న లేఖ రాశారు. దానిపై 26వ తేదీ రాత్రి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు వచ్చాయన్నారు. ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేయకుండా మే 1న ఇంటి వద్దనే పెన్షన్ (Pension)ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

దురదృష్ట ఘటనలకు సీఎం, సీఎస్ లదే బాధ్యత

"ఒక్కొక్క ఉద్యోగి 20 మందికి చొప్పున ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులు(Sachivalaya Staff) నాలుగు లక్షల మంది ప్రతి ఇంటికి వెళ్లి సులభంగా పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. శవ రాజకీయాలు చేస్తూ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) చనిపోయిన వృద్ధురాలిని పార్టీ కార్యాలయం వద్దకు తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ఈ నెలలో 30వ తేదీ కల్లా పెన్షన్ డబ్బులు(Pension Money) మ్యాపింగ్ చేసి.. మే 1న 6 గంటలకల్లా ప్రతి ఇంటికి పంపించాలి. మానవతా దృక్పథంతో చీఫ్ ఎలక్షన్ కమిషన్(Election Commission) ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా దురుద్దేశపూర్వకంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కాలయాపన చేసే కార్యక్రమం ఈరోజు కనపడింది. దురదృష్టకర సంఘటనలు పురావృతం అయితే దానికి సీఎం జగన్(CM Jagan), చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy), సెర్ఫ్ సీఈవో మురళీధర్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. జిల్లా కలెక్టర్లకు వారికున్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుని సీఎస్ కు చెప్పి డోర్ టు డోర్ ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలి. "- దేవినేని ఉమామహేశ్వరరావు

పింఛన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలు

ఏపీలో పింఛన్ల పంపిణీ(Pensions Distribution) పెద్ద ఉదంతంగా మారుతుంది. వాలంటీర్ల(Volunteers)పై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంతో...గత నెలలో పింఛన్ల పంపిణీలో హైడ్రామా నడిచింది. ఈ వ్యవహారంలో తాజాగా ఈసీ(EC) ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ కుదరని పక్షంలో డీబీటీ(DBT) రూపంలో నేరుగా పింఛనుదారులకు చెల్లించాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. అయితే ఇంటింటి పెన్షన్ల పంపిణీకి సరిపడా సిబ్బంది లేరని, ఏప్రిల్‌లో చేపట్టినట్లు చేస్తామని సీఎస్ ఈసీకి తెలిపారు. దీంతో ఈసీ...డీబీటీ(DBT) విధానంలో పంపిణీ చేయలని ఆదేశించింది. పింఛన్లు సహా నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను ఈసీ గుర్తు చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం