ap school reopening date 2024: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, స్కూళ్ల వేసవి సెలవులు పొడిగింపు-amaravati ap school reopening date 2024 on june 13 due to chandrababu swearing ceremony ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap School Reopening Date 2024: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, స్కూళ్ల వేసవి సెలవులు పొడిగింపు

ap school reopening date 2024: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, స్కూళ్ల వేసవి సెలవులు పొడిగింపు

HT Telugu Desk HT Telugu
Jun 12, 2024 09:30 AM IST

ap school reopening date 2024: ఏపీలో స్కూల్స్ ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. జూన్ 12న పాఠశాలలు రీఓపెన్ చేయాల్సి ఉండగా... జూన్ 13న ఓపెన్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, స్కూళ్ల సెలవులు పొడిగించే ఛాన్స్!
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, స్కూళ్ల సెలవులు పొడిగించే ఛాన్స్!

రాష్ట్రంలో విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.‌ స్కూల్ వేసవి సెలవులు పొడిగించింది. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 12న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో జూన్ 13న పాఠశాలలు తెరవనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతి ఏడాది జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి.‌ జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయి. కొన్ని‌ సందర్భాల్లో వేసవి వేడి తగ్గకపోతే వేసవి సెలవులు పెంచుతారు. అయితే ఇప్పుడూ స్కూళ్ల సెలవులు పొడిగించే అవకాశం ఉంది.

జూన్ 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. ఏపీలో జూన్ 11 వరకు సెలవులు ప్రకటించారు. పాఠశాలలు జూన్ 12న పున:ప్రారంభిస్తామని ప్రకటించారు. అయితే సెలవులు మరోరోజు పెరిగాయి. ఇప్పటికే స్కూళ్లల్లో అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఇటీవల ఏపీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా త్వరలోనే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. జూన్ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అదే రోజున, వేసవి సెలవుల తరువాత రాష్ట్రంలోని పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. దీంతో పాఠశాలలను ఈనెల 12కు బదులుగా, 13న తెరవాలని ఉపాధ్యాయ సంఘాలు, టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు వినతి పత్రం అందజేశారు. పాఠశాలల పున:ప్రారంభ తేదీని వాయిదా వేయాలని కోరారు.

ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో స్కూళ్ల రీఓపెన్ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఏపీలో స్కూల్స్ పున:ప్రారంభం అయ్యే తేదీ మారే అవకాశం ఉంది.‌ అయితే రాష్ట్రంలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు దాదాపు 50 రోజుల పాటు విద్యా‌ శాఖ వేసవి సెలవులు ప్రకటించింది. సెలవుల అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 13 నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి.

జూన్ 13న స్కూళ్ల రీఓపెన్

చంద్రబాబు ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఒకరోజు తరువాత అంటే, జూన్ 13న స్కూళ్లు తిరిగి తెరచుకోనున్నాయి.

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం