AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాాలయాల్లో అడ్మిషన్లు
AP KGBV Admissions: ఆంధ్రప్రదేశ్‌లోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో అర్హులైన బాలికలకు అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న 352 కేబివి పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా పథకం డైరెక్టర్ ప్రకటించారు.
AP KGBV Admissions: ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలలో 6వ, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు 7, 8,9 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో 2023 – 24 విద్యా సంవత్సరంలో 6, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 20 వరకు స్వీకరిస్తారు.
అనాథలు, బడి బయట ఉన్న పిల్లలు, స్కూల్ మధ్యలో మానేసిన డ్రాపౌట్స్, పేద, ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ, దారిద్య్రరేఖకు దిగువున ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని 11జిల్లాల్లోని కేజీవీబి పాఠశాలల్లో దాదాపు 8600మంది విద్యార్ధులు చదువుతున్నారు.
దరఖాస్తులను https://apkgbv.apcfss.in/ సైట్ ద్వారా చేయాల్సి ఉంటుంది. కేజీబీవిల్లో అడ్మిషన్లకు ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు. అడ్మిషన్లు పొందిన వారి వివరాలను అయా పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా ప్రదర్శిస్తారు. అడ్మిషన్ల విషయంలో ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే కేజీబీవీ హెల్ప్‌లైన్ నంబర్లు 9494383617 లేదా 9441270099 లేదా 9441214607 లేదా 9490782111 లలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.