Tirupati Crime : అమ్మాయితో సినిమాకు వెళ్లిన యువకుడు.. అంతలోనే కత్తిపోట్లు.. ట్విస్ట్ ఏంటంటే..-a youth was attacked with a knife in a cinema theater in tirupati city ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati Crime : అమ్మాయితో సినిమాకు వెళ్లిన యువకుడు.. అంతలోనే కత్తిపోట్లు.. ట్విస్ట్ ఏంటంటే..

Tirupati Crime : అమ్మాయితో సినిమాకు వెళ్లిన యువకుడు.. అంతలోనే కత్తిపోట్లు.. ట్విస్ట్ ఏంటంటే..

Basani Shiva Kumar HT Telugu
Sep 14, 2024 04:36 PM IST

Tirupati Crime : తిరుపతి నగరంలో సినిమా స్టైల్‌లో దాడి జరిగింది. ఓ యువకుడు అమ్మాయితో కలిసి సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తుండగా.. ఒక్కసారిగా కత్తితో దాడి జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ అబ్బాయిని షాక్‌కు గురిచేశాయి. ఈ ఘటనలో అసలు ట్విస్ట్ ఏంటంటే..

సినిమా థియేటర్‌లో యువకుడిపై కత్తితో దాడి
సినిమా థియేటర్‌లో యువకుడిపై కత్తితో దాడి

ఎంబీ యూనివర్సిటీలో చదివే లోకేష్ అనే యువకుడు తిరుపతి నగరంలోని పీజీఆర్ థియేటర్‌లో సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తుండగా.. అతనిపై ఒక్కసారిగా ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత దాడి చేసిన వ్యక్తి దర్జాగా హాలు నుంచి బయటకు వెళ్లాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

లోకేష్, ఓ యువతి ఇద్దరు కలిసి సినిమాకు టికెట్‌లు బుక్ చేసుకున్నారు. అనుకున్నట్టే సినిమాకు వెళ్లారు. వారు సినిమా చూస్తుండగా.. కార్తిక్ అనే యువకుడు సడెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కసారిగా లోకేష్‌పై విరుచుకుపడి.. కత్తితో దాడి చేశాడు. దాడిలో లోకేష్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే.. కత్తితో దాడి చేసిన తర్వాత.. ఆ యువతి లోకేష్‌తో కాకుండా.. కార్తిక్‌తో బయటకు వెళ్లింది. దీంతో లోకేష్ షాక్‌కు గురయ్యాడు.

గాయపడిన యువకుడు ఎం.బీ.యూ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన యువకుడిని రూయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడ్డిన యువకుడిని కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. అయితే.. కార్తిక్‌తో కలిసి యువతి లోకేష్‌పై కత్తితో దాడి చేయించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ యువతి, లోకేష్ సహచర విద్యార్థులని తెలుస్తోంది.

ప్రస్తుతం కార్తిక్, యువతి పరారీలో ఉన్నట్టు సమాచారం. కత్తితో దాడి చేసిన కార్తీక్, యువతి సూళ్లూరుపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. కత్తి దాడిలో గాయపడిన లోకేష్‌ది ప్రకాశం జిల్లా గిద్దలూరు అని పోలీసులు చెబుతున్నారు. దాడి చేసిన యువకుడు, అతనితో వెళ్లిన యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Whats_app_banner